Varalaxmi Sarathkumar | నా కథను మానభంగం చేశారు – రచయిత ట్వీట్ – క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
శుక్రవారం రిలీజైన సరస్వతి సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా రైటర్ సాయిమాధవ్ బుర్రా పై యాక్టర్ కమ్ డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్ అయ్యింది. ఇంతకీ వివాదం ఎందుకు మొదలైందంటే?
Entertainment | Published On Mar 7, 2026, 2.41 pm IST
Varalaxmi Sarathkumar | సరస్వతి మూవీతో ఫస్ట్ టైమ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ మెగాఫోన్ పట్టారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను ఉద్దేశించి రచయిత సాయిమాధవ్ బుర్రా చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
నాది రివేంజ్ డ్రామా కాదు...
"నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది.. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు.. కథ ని మానభంగం చేశారు.. నాది రివేంజ్ డ్రామా కాదు.. నా సోల్ వేరు.. అసలా కథే వేరు" అంటూ శుక్రవారం ఫేస్‌బుక్‌లో సాయిమాధవ్ బుర్రా ఓ పోస్ట్ పెట్టారు. సరస్వతి సినిమా పేరును మాత్రం తన పోస్ట్‌లో ప్రస్తావించలేదు. శుక్రవారం సరస్వతి రిలీజ్ కావడం, ఈ సినిమాకు అతడే రైటర్ కావడంతో ఈ మూవీని ఉద్దేశించే అతడు పోస్ట్ పెట్టాడని నెటిజన్లు భావించారు.
తాజాగా సరస్వతి మూవీ సక్సెస్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో సాయిమాధవ్ బుర్రా పోస్ట్‌పై వరలక్ష్మి శరత్‌కుమార్ రియాక్ట్ కావడంతో నెటిజన్ల అనుమానం నిజమని తేలిపోయింది. సాయిమాధవ్ బుర్రాకు డబ్బులు ఇచ్చి ఈ కథ కొన్నట్లు వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పింది.
ఆరేళ్లు ఎందుకు ఉంది...
"సరస్వతి కథ ఆయన దగ్గర ఆరేళ్లు ఉంది. నిజంగా అంత బాగుంటే అన్నేళ్లు ఎందుకు ఆ కథతో సాయిమాధవ్ సినిమా చేయలేదు. నేను ఈ కథను చాలా మందికి చెప్పా. కానీ సెకండాఫ్ బాగాలేదని అందరూ అన్నారు. సాయిమాధవ్ బుర్రా కథలోని లైన్‌ను తీసుకొని నాకు నచ్చినట్లుగా స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసుకున్నాను. నేను రాసిన డైలాగ్స్, క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నాయని ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు" అని వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పింది. సాయిమాధవ్‌పై గౌరవం ఉంది కాబట్టే స్టోరీ రైటర్‌గా టైటిల్స్‌లో ఆయన పేరే వేశానని అన్నది.
ఒక్కసారి కూడా రాలేదు...
"సాయిమాధవ్ బుర్రా కథను మాకు ఇచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు. కలవమని అడిగితే వాయిస్ , ఆడియో నోట్స్ పంపించేవారు. ఒక్క సిట్టింగ్‌కు కూడా రాలేదు. ఆయన బిజీగా ఉండటంతోనే నేనే మార్పులు చేశా. రేప్ లాంటి పదం ఆయన వాడటం కరెక్ట్ కాదు. మా మధ్య చాలా జరిగాయి. వాటిని బయటపెట్టి నా స్థాయిని దిగజార్చుకోవాలని అనుకోవడం లేదు" అని వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పింది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



