త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samyuktha | భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ ఆయ‌న‌తో న‌టించాల‌ని ఉంది : సంయుక్త‌

Samyuktha | మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది సంయుక్త‌. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ ‘గోల్డెన్ లెగ్’గా పేరు పొందింది. ప్ర‌స్తుతం హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో ప‌లు చిత్రాల్లో ఫుల్ బిజీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బీమ్లా నాయక్’ చిత్రంలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

P

Entertainment | Published On Apr 3, 2026, 6.05 pm IST

Samyuktha | భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ ఆయ‌న‌తో న‌టించాల‌ని ఉంది : సంయుక్త‌
Advertisement

Samyuktha | మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది సంయుక్త‌. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో ప‌లు చిత్రాల్లో ఫుల్ బిజీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బీమ్లా నాయక్’ చిత్రంలో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మూవీలో లీడ్ రోల్‌లో న‌టించ‌క‌పోయినా.. త‌న‌దైన న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత బింబిసార, విరూపాక్ష వంటి చిత్రాల బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంయుక్త ‘సార్’ మూవీలో ధనుష్‌తో పని చేసిన అనుభవాన్ని పంచుకుంది. “ధనుష్ సెట్‌లో చాలా సైలెంట్‌గా ఉంటారు. కానీ కెమెరా ఎదురుచేసినప్పుడు అద్భుతమైన శక్తిని ప్రదర్శిస్తారు. ఆయన ఎంచుకున్న కథల్లో ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయనతో పనిచేయడం నాకు ఒక గొప్ప పాఠం లాంటిది. భవిష్యత్తులో మళ్లీ ఆయనతో నటించాలనే కోరిక ఉంది” అని సంయుక్త తెలిపింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సార్’ సినిమా విద్యా వ్యవస్థలోని లోపాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది. ఈ సినిమా రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు రాబ‌ట్టింది. ఇందులో మీనాక్షి అనే బోటనీ లెక్చరర్ పాత్రలో సంయుక్త ఒదిగిపోయింది. గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకోవడమే తన విజయ రహస్యమని ఆమె స్పష్టం చేసింది. త‌మిళంలో వాతి పేరుతో విడుద‌లైన విష‌యం తెలిసిందే.

ఇంటర్వ్యూలో సంయుక్త తన అభిరుచి, పాత్రలపై ఎప్పుడూ ఎక్కువ దృష్టి పెట్టే విధానం గురించి కూడా వివరించింది. త‌న‌కు కథ, పాత్ర కీల‌క‌మ‌ని, తెలిపింది. ప్రేక్షకులు త‌న‌ను గ్లామర్ మాత్రమే కాకుండా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో చూడాల‌ని కోరుకుంటున్నార‌ని భావిస్తున్నాన‌ని తెలిపింది. అందుకే ప్రతీ సినిమాలోనూ పాత్రలో భావావేశం ఉండేలా చూసేకునేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పింది. ఇదిలా ఉండ‌గా.. సంయుక్త ప్ర‌స్తుతం తెలుగులో స్వ‌యంభూ మూవీలో న‌టిస్తుంది. ఈ మూవీలో రిలీజ్‌కు సిద్ధ‌మైంది. అలాగే, పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి హీరోగా తెర‌కెక్క‌నున్న స్ల‌మ్‌డాగ్‌: 33 టెంపుల్ రోడ్ మూవీలోనూ హీరోగా ఎంపికైంది. అలాగే, బాలీవుడ్‌లో మ‌హారాగ్ఞి, మ‌ల‌యాళంలో రామ్‌, త‌మిళంలో బెంజ్ మూవీల్లో న‌టిస్తోంది.

Advertisement
Advertisement