త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samyuktha | వరుస ప్రాజెక్టుల్లో బిజీబిజీ.. సోలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కోసం సంయుక్త ఎదురుచూపులు..!

Samyuktha | సంయుక్త గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే పలు మూవీల్లో నటించగా.. బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్స్‌గా నిలిచాయి. అయితే, బ్యూటీకి మాత్రం సోలో హీరోయిన్‌గా నటించిన చిత్రాలు మాత్రం కలిసిరాలేదు. ధనుష్‌తో చేసిన ‘సార్‌’ మూవీ సైతం పెద్దగా హిట్స్‌ లేవు. సంయుక్త భీమ్లా నాయక్‌ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

P

Entertainment | Published On Apr 1, 2026, 7.30 pm IST

Samyuktha | వరుస ప్రాజెక్టుల్లో బిజీబిజీ.. సోలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కోసం సంయుక్త ఎదురుచూపులు..!
Advertisement

Samyuktha | సంయుక్త గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే పలు మూవీల్లో నటించగా.. బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్స్‌గా నిలిచాయి. అయితే, బ్యూటీకి మాత్రం సోలో హీరోయిన్‌గా నటించిన చిత్రాలు మాత్రం కలిసిరాలేదు. ధనుష్‌తో చేసిన ‘సార్‌’ మూవీ సైతం పెద్దగా హిట్స్‌ లేవు. సంయుక్త భీమ్లా నాయక్‌ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో లీడ్‌ రోల్‌లో మాత్రం కనిపించలేదు. ఆ తర్వాత లవ్‌ మీ సినిమాలోనూ అదే పరిస్థితి కనిపించింది.

సాయిధరమ్‌ తేజ హీరోగా వచ్చిన విరూపాక్ష మూవీలోనూ కనిపించింది. ఇందులో సంయుక్త పాత్ర ప్రత్యేకంగా నిలిచింది గానీ.. సాధారణ హీరోయిన్‌ పాత్ర మాత్రం కాదు. మూవీ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అయినప్పటికీ.. ఆమె పాత్రను స్పెషల్‌ అపియరెన్స్‌గానే పేర్కొంటున్నారు. కల్యాణ్‌ రామ్‌తో చేరిన ‘డెవిల్‌’లో నటించగా.. పెద్దగా సక్సెస్‌ కాలేదు. అఖండ మూవీలో కనిపించగా.. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదు. అనంతరం ‘నారి నారి నడుమ మురారి’తో విజయం దక్కింది.

ఇందులో సంయుక్తతో పాటు సాక్షి వైద్య సైతం నటించింది. ఇప్పటి వరకు సంయుక్తకు సోలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ దక్కలేదు. సంయుక్త ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. తెలుగులోనే నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు మూవీలో సంయుక్తతో పాటు నభా నటేశ్‌ సైతం నటిస్తోంది. హిందీలో మహారాణి: క్వీన్‌ ఆఫ్‌ క్వీన్స్‌, మలయాళంలో రామ్‌, తమిళంలో బెంజ్‌, స్లమ్‌ డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌, బ్లాక్‌ గోల్డ్‌ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలు సక్సెస్‌ అయితే.. ఆమె కెరీర్‌ దూసుకువెళ్లే అవకాశాలున్నాయి.

Advertisement
Advertisement