Comedy OTT | ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ – చిరంజీవి, పవన్ మధ్య గొడవలు వస్తే…
సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తెలుగు కామెడీ మూవీ సోదరా థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. మే 1 నుంచి ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Entertainment | Published On Apr 28, 2026, 5.23 pm IST
Comedy OTT | సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తెలుగు కామెడీ మూవీ సోదరా థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. అన్నదమ్ముల అనుబంధానికి వినోదాన్ని జోడించి రూపొందించిన ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ మరో హీరోగా నటించాడు. ఆర్తి గుప్తా, ప్రాచి బన్సాల్ హీరోయిన్లుగా నటించారు. సోదరా మూవీకి మన్ మోహన్ దర్శకత్వం వహించాడు.
ఆహా ఓటీటీలో...
ఈ ఎమోషనల్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వెల్లడైంది. మే 1 నుంచి ఆహా ఓటీటీలో సంపూర్ణేష్ బాబు సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో...
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు సోదరా మూవీని దర్శకుడు మన్‌మెహన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బాబుమోహన్‌తో పాటు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, గెటప్ శీను కీలక పాత్రల్లో నటించారు. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో పాటు కామెడీ వర్కవుట్ కాకపోవడంతో ఈ సినిమా ఫెయిలయ్యింది. సోదర మూవీకి సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు.
చిరంజీవి...పవన్ కళ్యాణ్..
చిరంజీవి (సంపూర్ణేష్ బాబు ), పవన్ కళ్యాణ్ ( సంజోష్ ) అన్నదమ్ములు. చిరంజీవి సోడా బిజినెస్ చేస్తుంటాడు. తమ ఎదురింట్లోకి కొత్తగా వచ్చిన దివి అనే అమ్మాయిని చిరంజీవి, పవన్ ఇద్దరూ ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కారణంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తాయి? ఆ తర్వాత ఏమైంది? ఈ ఇద్దరిలో దివి ఎవరిని ప్రేమించింది? పవన్ కళ్యాన్ లైఫ్‌లోకి వచ్చిన భువి ఎవరు? దివి కుటుంబంతో చిరంజీవి ఎందుకు గొడవపడ్డాడు? అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



