త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | తెలంగాణ స్టైల్‌లో పెళ్లి చేసుకున్న స‌మంత‌

స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోన్న మా ఇంటి బంగారం షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ముగిసిన లేటెస్ట్ షెడ్యూల్‌లో హైద‌రాబాద్‌లో స‌మంత పెళ్లి తాలూకు సీన్ల‌ను పూర్తిచేసిన‌ట్లు స‌మాచారం.

a

Entertainment | Published On Feb 20, 2026, 3.31 pm IST

Samantha | తెలంగాణ స్టైల్‌లో పెళ్లి చేసుకున్న స‌మంత‌
Advertisement

Samantha | హీరోయిన్ స‌మంత పెళ్లి గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో కుటుంబ‌స‌భ్యులు, బంధువులు సంద‌డి చేశారు. . అదేంటి స‌మంత పెళ్లి గ‌త డిసెంబ‌ర్‌లోనే జ‌రిగింది క‌దా...మ‌ళ్లీ పెళ్లి ఏంట‌ని అనుకుంటున్నారా. రియ‌ల్ పెళ్లి కాదు. రీల్ పెళ్లి. ప్ర‌స్తుతం మా ఇంటి బంగారం పేరుతో క్రైమ్ కామెడీ మూవీ చేస్తోంది స‌మంత‌. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత స్వ‌యంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు గుల్ష‌న్ దేవ‌య్య‌తో పాటు గౌత‌మి, దిగంత్ , శ్రీముఖి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

తెలంగాణ స్టైల్‌లో...

మా ఇంటి బంగారం షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. గురువారం నాటితో ముగిసిన లేటెస్ట్ షెడ్యూల్‌లో హైద‌రాబాద్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్‌లో స‌మంత పెళ్లి వేడుక తాలూకు సీన్ల‌ను డైరెక్ట‌ర్ నందిని రెడ్డి షూట్ చేశార‌ట‌. తెలంగాణ స్టైల్‌లో స‌మంత‌, క‌న్న‌డ న‌టుడు దిగంత్‌ల‌పై చిత్రీక‌రించిన ఈ పెళ్లి సీన్ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. పెళ్లి కూతురు గెట‌ప్‌లో స‌మంత లుక్ ఆక‌ట్టుకుంటుంద‌ని అంటున్నారు. వింటేజ్ సామ్ మ‌ళ్లీ గుర్తుకురావ‌డం ఖాయ‌మ‌ని టాక్ వినిపిస్తోంది.

షూటింగ్ ఎండింగ్‌...

మా ఇంటి బంగారం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో స‌మంత తెలంగాణ యువ‌తిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ ద్వారా మేక‌ర్స్ హిట్ ఇచ్చారు. ఈ సినిమా కోసం స‌మంత తెలంగాణ యాస కూడా నేర్చుకున్న‌ట్లు స‌మాచారం.
ఓ పెద్దింటి కుటుంబంలోకి కోడ‌లిగా అడుగుపెట్టిన ఓ యువ‌తి క‌థ‌తో మా ఇంటి బంగారం మూవీ రాబోతుంది. డాన్ అయిన ఆమె త‌న గ‌తం గురించి అత్తింటివారికి తెలియ‌కుండా ఎలా జాగ్ర‌త్త‌ప‌డింద‌నే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. మా ఇంటి బంగారం సినిమాను ఈ ఏడాది వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌మంత స‌న్నాహాలు చేస్తోంది.

మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత‌...

దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోన్న మూవీ ఇది. చివ‌ర‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషితో తెలుగు ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించింది. నాగ‌చైత‌న్య‌తో విడాకులు, మ‌యోసైటిస్ కార‌ణంగా సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన స‌మంత శుభం మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను నిర్మిస్తూనే ఇందులో ఓ గెస్ట్ రోల్ చేసింది.

Advertisement
Advertisement