Alia Bhatt | అలియా భట్ చేసిన పనికి సమంత ఫిదా – హార్ట్ ఎమోజీతో ఎమోషనల్ పోస్ట్…
అదివారం లండన్‌లో జరిగిన బాఫ్టా అవార్డ్స్ ఈవెంట్‌కు బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలో నాన్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డును హిందీలో అనౌన్స్‌చేసింది అలియా. బాలీవుడ్ హీరోయిన్ హిందీ స్పీచ్‌కు సమంత ఫిదా అయ్యింది.
Entertainment | Published On Feb 23, 2026, 3.33 pm IST
Alia Bhatt | బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ చేసిన ఓ పనికి టాలీవుడ్ బ్యూటీ సమంత ఫిదా అయ్యింది. ఆమెపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించింది. బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్) వేడుక ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అవార్డ్ ప్రజెంటర్ హోదాలో ఈ ఈవెంట్‌లో అలియా పాల్గొన్నది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే తర్వాత బాఫ్టా అవార్డ్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన మూడో ఇండియన్ హీరోయిన్‌గా అలియా రికార్డ్ నెలకొల్పింది.
సిల్వర్ కలర్ గౌను...
ఈ వేడుకలో సిల్వర్ కలర్ గౌనులో రెడ్‌కార్పెట్‌పై మెరిసింది అలియా. ఇంటర్నేషనల్ డిజైన్ డెమ్నా...అలియా కోసం ప్రత్యేకంగా ఈ డ్రెస్‌ను సిద్ధం చేశారు. అలియా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు పదిహేను లక్షలకుపైనే ఉంటుందని సమాచారం.
హిందీ స్పీచ్...
బాఫ్టా వేడుకలో నాన్ ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో బెస్ట్ మూవీకి అలియా అవార్డును అందజేసింది. అలియా కంటే ముందు అనౌన్స్‌చేసిన ప్రజెంటర్స్ అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడారు. కానీ అలియా మాత్రం హిందీలో తన స్పీచ్‌ను మొదలుపెట్టి ఆహుతులను సర్‌ప్రైజ్ చేసింది. "నెక్స్ట్ ప్రకటించబోయే అవార్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కు సంబంధించినది కాదు" అంటూ హిందీలో అలియా ప్రకటించారు. అలియా చెప్పింది అక్కడి వారికి అర్థం కాకపోవడంతో వెంటనే ఇంగ్లీష్‌లో కూడా తన మాటల్ని రిపీట్ చేసింది. "సినిమా అన్నది యూనివర్సల్ ఎమోషన్ అని, దానికి భాషాభేదాలతో దానికి సంబంధం ఉండదంటూ "అలియా తన స్పీచ్‌ను కంటిన్యూ చేసింది. నార్వేకు చెందిన సెంటిమెంటల్ వాల్యూ అనే సినిమాకు అలియా అవార్డు అందజేసింది. కాగా బాఫ్టాలో హిందీలో మాట్లాడిన ఫస్ట్ సెలిబ్రిటీగా అలియా నిలిచింది.
సమంత ప్రశంసలు...
అలియా భట్ హిందీ స్పీచ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత ఎమోషనల్ పోస్ట్ చేసింది. హార్ట్ ఎమోజీని జోడించింది. భారతీయ భాష, సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పిన అలియా ధైర్యానికి, ఆత్మవిశ్వసానికి తాను ఫిదా అయ్యానంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది సమంత. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
అప్‌కమింగ్ మూవీస్...
బాఫ్టా వేడుకలో అప్‌కమింగ్ మూవీస్ ఆల్ఫా, లవ్ అండ్ వార్ విశేషాలతో పంచుకున్నది అలియా భట్. అంతే కాకుండా కూతురు రాహా గురించి చెప్పింది. ఫ్యామిలీ లైఫ్, యాక్టింగ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తునదో చెప్పింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



