త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో స‌మంత‌, కాజ‌ల్, త‌మ‌న్నా – సౌత్ క్వీన్స్ రీయూనియ‌న్‌

ద‌క్షిణాది హీరోయిన్లు అంద‌రూ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించారు. ఇటీవ‌ల త‌మ‌న్నా త‌న జ్యూవెల్ల‌రీ బ్రాండ్‌కు సంబంధించిన కొత్త స్టోర్‌ను ముంబాయిలో లాంఛ్ చేసింది. ఈ స్టోర్ లాంఛ్ ఈవెంట్‌లో స‌మంత‌, కాజ‌ల్‌, మృణాల్ ఠాకూర్‌, పూజా హెగ్డే సంద‌డి చేశారు.

N

Entertainment | Published On Feb 1, 2026, 4.51 pm IST

Samantha – Tamannaah | ఒకే ఫ్రేమ్‌లో స‌మంత‌, కాజ‌ల్, త‌మ‌న్నా –  సౌత్ క్వీన్స్ రీయూనియ‌న్‌
Advertisement

Samantha - Tamannaah | సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల మ‌ధ్య పోటీ ఎక్కువ‌గానే ఉంటుంది. నంబ‌ర్ వ‌న్ ప్లేస్ కోసం కాంపిటీష‌న్‌తో పాటు ఒక‌రి ఆఫ‌ర్ల‌ను మ‌రొక‌రు కొట్టేయ‌డం లాంటివి త‌ర‌చుగా జ‌రుగుతూనే ఉంటాయి. పైకి క‌న‌బ‌డ‌క‌పోయినా క‌థానాయిక‌ల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తూనే ఉంటుంద‌ని చెబుతుంటారు. కానీ సౌత్ హీరోయిన్లు మాత్రం పోటీని ప‌క్క‌న‌పెట్టి ఒక‌రికి మ‌రొక‌రు అండ‌గా నిలుస్తున్నారు. హీరోయిన్ల మ‌ధ్య ఉన్న ఐక్య‌త మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

త‌మ‌న్నా జ్యూవెల్ల‌రీ బిజినెస్‌....

ఓ వైపు సినిమాలు చేస్తూనే చాలా కాలంగా త‌మ‌న్నా జ్యూవెల్ల‌రీ బిజినెస్‌లో కొన‌సాగుతోంది. తండ్రితో క‌లిసి స‌క్సెస్‌ఫుల్‌గా సొంత బిజినెస్‌ను ర‌న్ చేస్తోంది. త‌మ‌న్నా జ్యూవెల్ల‌రీ బ్రాండ్‌కు సంబంధించిన కొత్త స్టోర్ ఇటీవ‌ల ముంబైలోని జుహూలో ప్రారంభ‌మైంది.

ద‌క్షిణాది హీరోయిన్లు...

త‌మ‌న్నా ఫైన్ జ్యూవెల్ల‌రీ పేరుతోనే ఈ స్టోర్‌ను లాంఛ్ చేసింది. ఈ స్టోర్ ఓపెనింగ్‌కు స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్‌, ద‌క్షిణాది హీరోయిన్లు అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

కోల్డ్ వార్‌...

ఇందులో స‌మంత‌, త‌మ‌న్నా, కాజ‌ల్ చాలా క్లోజ్‌గా క‌నిపించారు. స‌మంత‌, కాజ‌ల్ మ‌ధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ జ‌రుగుతోన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. వీరిద్ద‌రు క‌లిసి బృందావ‌నం, బ్ర‌హ్మోత్స‌వంతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశారు. ఈ సినిమా షూటింగ్‌ల‌లోనే వీరి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌లైన‌ట్లు పుకార్లు వ‌చ్చాయి. కాజ‌ల్ నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న టైమ్‌లోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన స‌మంత ఆమె ప్లేస్‌ను కొట్టేసింద‌ని, అదే ఇద్ద‌రి మ‌ధ్య ఈగో క్లాషెస్‌కు కార‌ణ‌మ‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపించాయి. అవ‌న్నీ రూమ‌ర్లేన‌ని త‌మ‌న్నా స్టోర్ లాంఛింగ్ ఈవెంట్‌తో కాజ‌ల్‌, స‌మంత చాటిచెప్పారు.ఈ ఈవెంట్‌లో వీరిద్ద‌రు చాలా క్లోజ్‌గా క‌నిపించారు. త‌మ మ‌ధ్య మంచి బాండింగ్ ఉంద‌ని హీరోయిన్లు అంద‌రూ నిరూపించారు.ద‌క్షిణాది క్వీన్స్ రీయూనియ‌న్ పార్టీలా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతోన్నారు.

Advertisement
Advertisement