Rukmini Vasanth | ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌కు “నో” చెప్పిన సాయిపల్లవి – కన్నడ బ్యూటీకి ఛాన్స్
కాంతార ఛాప్టర్ వన్ బ్యూటీ రుక్మిణి వసంత్ తెలుగులో మరో బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ నుంచి సాయిపల్లవి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ రుక్మిణి వసంత్‌ను వరించినట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Apr 26, 2026, 2.51 pm IST
Rukmini Vasanth | దిగ్గజ కర్ణాటక సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కుతోంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ బయోపిక్‌లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయట. అఫీషియల్‌గా ఈ బయోపిక్‌ను అనౌన్స్ చేసేందుకు రెడీ అయిన మేకర్స్‌కు సాయిపల్లవి పెద్ద షాకిచ్చినట్లు సమాచారం. ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు డేట్ ఇష్యూస్ కారణమట.
రామాయణ...
ప్రస్తుతం బాలీవుడ్‌లో రామాయణతో పాటు తమిళంలో మణిరత్నంతో ఓ లవ్‌స్టోరీ చేస్తోంది సాయిపల్లవి. ఈ రెండు సినిమాల షూటింగ్‌లతో సుబ్బులక్ష్మి బయోపిక్ డేట్స్ క్లాష్ అయ్యాయట. దాంతో ఈ బయోపిక్ నుంచి సాయిపల్లవి వైదొలిగినట్లు టాక్ వినిపిస్తోంది.
కాంతార ఛాప్టర్ వన్...
సాయిపల్లవి స్థానంలో ఈ బయోపిక్‌లో హీరోయిన్‌గా కాంతార చాఫ్టర్ వన్ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను మేకర్స్ ఎంపికచేసినట్లు తెలిసింది. గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ విని ఇంప్రెస్ అయిన రుక్మిణి ఈ బయోపిక్‌కు ఓకే చెప్పిందట.
సాధారణ కుటుంబంలో పుట్టిన సుబ్బలక్ష్మి దేశం గర్వించే సంగీతకళాకారిణిగా ఎలా ఎదిగింది? అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న సదాశివన్‌తో ఆమె ప్రేమాయణం? సినీ నటిగా ఎంట్రీతో పాటు సుబ్బులక్ష్మి జీవితంలోని పలు కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ ఈ బయోపిక్‌ను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోతున్నారట.
రీసెర్చ్...
ఈ సినిమా కోసం రుక్మిణి వసంత్ కూడా సుబ్బులక్ష్మి జీవితంపై రీసెర్చ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. వర్క్‌షాప్స్‌లో కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. రుక్మిణి వసంత్ అంగీకరించిన తొలి బయోపిక్ మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. సుబ్బులక్ష్మి బయోపిక్‌ను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించబోతున్నారట.
ప్రస్తుతం యశ్ టాక్సిక్‌తో పాటు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలు చేస్తోంది రుక్మిణి వసంత్. టాక్సిక్ మూవీ జూన్ 4న థియేటర్లలోకి రాబోతుంది. ఈ గ్యాంగ్‌స్టర్ మూవీలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా ఇతర హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



