Release Date | శర్వానంద్ బైకర్ కొత్త రిలీజ్ డేట్ ఇదే – మూడేళ్ల తర్వాత తెలుగు హీరోయిన్‌కు ఛాన్స్
శర్వానంద్ బైకర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Entertainment | Published On Feb 3, 2026, 7.33 pm IST
Release Date | సంక్రాంతి రిలీజైన నారీ నారీ నడుమ మురారి మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత పెద్ద విజయాన్ని అందుకున్నారు శర్వానంద్. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. నారీ నారీ నడుమ మురారి సక్సెస్ జోష్‌లోనే తన నెక్స్ట్ మూవీ బైకర్ రిలీజ్ డేట్ చెప్పేశారు శర్వానంద్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీని మంగళవారం వెల్లడించిన మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో కంప్లీట్ రేసర్ లుక్‌లో శర్వానంద్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
మాళవికా నాయర్ హీరోయిన్...
బైకర్ మూవీలో శర్వానంద్ జోడీగా మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది ఈ అచ్చ తెలుగు బ్యూటీ. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన క్యారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. బైకర్ మూవీలో శర్వానంద్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బైకర్ మూవీకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
మూడు జనరేషన్ల కథ...
1990, 2000 కాలాల నేపథ్యంలో మూడు జనరేషన్స్ కథతో ఈ సినిమా సాగనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రేసింగ్ ఎలిమెంట్స్‌తో పాటు బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. జిబ్రాన్ ఈ సినిమాకు బ్యూజిక్ అందిస్తున్నాడు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం సంపత్ నందితో భోగి సినిమా షూటింగ్‌తో శర్వానంద్ బిజీగా ఉన్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. భోగి మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. భోగి మూవీ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంక్రాంతి బరిలో...
భోగి తర్వాత డైరెక్టర్ శ్రీను వైట్లతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ చేయబోతున్నాడు శర్వానంద్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



