Jai Hanuman | ఎట్టకేలకు జై హనుమాన్ షురూ – ఆంజనేయుడి జన్మస్థలంలో…
హానుమాన్ సీక్వెల్ ఎట్టకేలకు లాంఛ్ అయ్యింది. రిషబ్ శెట్టి హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ హంపిలోని అంజనాద్రి బెట్టలో ప్రారంభమైంది. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో తేజా సజ్జా పాల్గొన్నాడు.
Entertainment | Published On Feb 22, 2026, 2.55 pm IST
Jai Hanuman | తేజా సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 40 కోట్ల బడ్జెట్‌తో మైథలాజికల్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. రెండు నేషనల్ అవార్డులను కూడా అందుకుంది. హనుమాన్ క్లైమాక్స్‌లో...ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు ప్రకటించారు. కాంతార ఫేర్ రిషబ్ శెట్టి హీరోగా జై హనుమాన్ పేరుతో చాలా రోజుల క్రితమే ఈ సీక్వెల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు.
అనుమానాలు...
హనుమాన్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన సినిమాలన్నీ ఆగిపోవడంతో జై హనుమాన్‌పై ఆడియెన్స్‌లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ సీక్వెల్ కూడా ఆగిపోయినట్లు పుకార్లు వినిపించాయి. ఈ రూమర్లకు పుల్‌స్టాప్ పెడుతూ ఎట్టకేలకు జై హనుమాన్ సీక్వెల్‌ను ఆదివారం లాంఛ్ చేశారు.
మైథలాజికల్....
హనుమాన్ తరహాలోనే మైథలాజికల్ అంశాలతో సూపర్ హీరో మూవీగా ఈ సీక్వెల్ తెరకెక్కుతోంది. రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత హనుమంతుడికి రాముడు ఏమని మాటిచ్చాడు? ఆ మాట నిలబెట్టుకోవడానికి శ్రీరాముడు ఏం చేశాడనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
హనుమాన్ జన్మస్థలం...
హనుమంతుడి నేపథ్యంలో సాగే సినిమా కావడంతో జై హనుమాన్ ఓపెనింగ్ ఈవెంట్‌ను స్పెషల్ ప్లేస్‌లో నిర్వహించారు మేకర్స్. హనుమంతుడి జన్మస్థలంగా పురాణాలు చెబుతున్న హంపిలోని అంజనాది బెట్టలో జై హనుమాన్ మూవీని లాంఛ్ చేశారు. ఈ వేడుకలో హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు తేజా సజ్జా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
రానా దగ్గుబాటి....
జై హనుమాన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. హనుమాన్ హీరో తేజా సజ్జా కూడా ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



