Rhea Singha | టాలీవుడ్‌లోకి రియాసింఘా.. జెట్లీ మూవీతో ఎంట్రీ..!
Rhea Singha | మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రియా సింఘా ప్రస్తుతం సినీరంగంలోకి అడుగు పెడుతోంది. గతంలోనూ పలువురు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీల్లో నటించిన అందాల తారలు సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Entertainment | Published On Apr 4, 2026, 8.14 pm IST
Rhea Singha | మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రియా సింఘా ప్రస్తుతం సినీరంగంలోకి అడుగు పెడుతోంది. గతంలోనూ పలువురు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీల్లో నటించిన అందాల తారలు సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వారి బాటలోనే రియా సంఘా నడుస్తోంది. తొలిసారిగా తెలుగులో జెట్లీ మూవీ చేయబోతోంది. కమెడియన్ సత్యతో కలిసి నటించనుంది. మొదటి సినిమాలోనే యాక్షన్ రోల్ కనిపించనుంది.
చేతిలో గన్ పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న రియా లుక్ పోస్ట్ విడుదల కాగా అభిమానులను ఆకర్షించింది. ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘జెట్లీ’ సినిమాలో రియా పాత్ర గ్లామర్ మాత్రమే కాకుండా.. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ తదితర అంశాల్లో మంచి స్కోప్ ఉందని సమాచారం. ఈ మూవీ కోసం నటనలో ప్రత్యేక శిక్షణతో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం కొద్దిరోజులు శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. రియా పరిచయం అయ్యే ముందు ఆమె మోడలింగ్ 2024లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో కిరీటాన్ని నెగ్గింది. అంతకు ముందు మిస్ టీన్ యూనివర్స్ టైటిల్‌ను సైతం సాధించింది.
చిన్నప్పటి నుండి ఫ్యాషన్, గ్లామర్ రంగాలపై ఆసక్తి చూపిన రియా, మోడలింగ్ ద్వారా తన వ్యక్తిత్వం, స్టేజ్ ప్రెజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకుంది. అందాల పోటీలలో మాత్రమే కాకుండా, సామాజిక అవగాహన, ప్రజలతో కమ్యూనికేషన్ నైపుణ్యం ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో రియా సింఘా ‘జెట్లీ’ సినిమాతో ఎంట్రీ ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లో రాబోయే రోజుల్లో మరింత పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నది. జెట్లీ సినిమా విజయవంతమైతే.. టాలీవుడ్‌లో మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశం ఉంది. అందాల వేదిక నుంచి వెండితెరకు అడుగుపెడుతున్న రియా సింఘా గ్లామర్‌తో పాటు నటనలోనూ తన సత్తా చాటితే అగ్రహీరోయిన్‌గా ఎదిగే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



