త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | మైసా కోసం మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగ్ …ర‌ష్మిక డెడికేష‌న్ అన్‌స్టాప‌బుల్‌

మైసా పేరుతో ప్ర‌స్తుతం తెలుగులో లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ మూవీ చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సినిమా కోసం ఫారిన్‌లో మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Apr 18, 2026, 3.01 pm IST

Rashmika Mandanna | మైసా కోసం మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగ్ …ర‌ష్మిక డెడికేష‌న్ అన్‌స్టాప‌బుల్‌
Advertisement

Rashmika Mandanna | లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా కోసం ర‌ష్మిక మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఫారిన్ వెళ్లింది. ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను పెళ్లి చేసుకొని త‌న జీవితంలో కొత్త ఛాప్ట‌ర్‌ను మొద‌లుపెట్టింది ర‌ష్మిక మంద‌న్న‌. పెళ్లి వేడుక‌ల కోసం నెల రోజుల పాటు బ్రేక్ తీసుకున్న ఈ జంట మ‌ళ్లీ సినిమాల షూటింగ్‌ల‌తో బిజీ అయ్యారు. ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్‌, టాలీవుడ్‌లో క‌లిపి మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో లేడీ ఓరియెంటెడ్ మూవీ మైసా ఒక‌టి. హై ఇంటెన్స్ పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్నఈ సినిమాకు ర‌వీంద్ర పుల్లె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

బ్యాంకాక్‌లో...

ఈ సినిమా కోసం ర‌ష్మిక మంద‌న్న మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇందుకోసం ఇటీవ‌లే బ్యాంకాక్ వెళ్లింది. బ్యాంకాక్‌లో ఫేమ‌స్ అయిన జైకా స్టంట్ కొరియోగ్ర‌ఫీ టీమ్‌ సార‌థ్యంలో ర‌ష్మిక ట్రైనింగ్ కొన‌సాగుతోంద‌ట‌. హ్యాండ్ టూ హ్యాండ్ కాంబాట్ టెక్నిక్స్‌తో పాటు రిస్కీ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తోంద‌ట‌. ప్ర‌తి రోజు ఎనిమిది గంట‌ల పాటు ర‌ష్మిక ట్రైనింగ్ కొన‌సాగుతోన్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ర‌ష్మిక మార్ష‌ల్ ఆర్ట్స్ శిక్ష‌ణ‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

త్వ‌ర‌లో...కేర‌ళ‌లో...

మైసా నెక్స్ట్ షెడ్యూల్ కేర‌ళ‌లో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్‌లో ర‌ష్మిక‌పై భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ షెడ్యూల్ కోస‌మే ర‌ష్మిక మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ తీసుకుంటుంద‌ట‌.

గోండు యువ‌తిగా...

మైసా మూవీలో ర‌ష్మిక గోండు యువ‌తిగా క‌నిపించ‌బోతున్న‌ది. గ‌తంలో చేసిన సినిమాల‌కు భిన్నంగా ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో ర‌ష్మిక క్యారెక్ట‌ర్ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త‌న జాతి కోసం ఓ యువ‌తి సాగించిన పోరాటం నేప‌థ్యంలో మైసా మూవీ తెర‌కెక్కుతోంది. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
మైసా మూవీలో ఈశ్వ‌రీ రావు, గురు సోమ‌సుంద‌రం, రావుర‌మేష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

Advertisement
Advertisement