Rashmika Mandanna | బాలీవుడ్‌లో మూవీని రిజెక్ట్ చేసిన రష్మిక..! విజయ్‌తో పెళ్లే కారణమా..?
Rashmika Mandanna | కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హిందీల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. ఒక తెలుగు సినిమా చేస్తూనే.. మరో హిందీ సినిమాకు సైతం క్వాలిషీట్స్ ఇస్తున్నది. ఓ వైపు టాలీవుడ్.. మరో వైపు బాలీవుడ్‌నూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బాలీవుడ్‌లో ఓ మూవీ ఆఫర్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.
Entertainment | Published On Feb 18, 2026, 1.25 pm IST
Rashmika Mandanna | కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హిందీల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. ఒక తెలుగు సినిమా చేస్తూనే.. మరో హిందీ సినిమాకు సైతం క్వాలిషీట్స్ ఇస్తున్నది. ఓ వైపు టాలీవుడ్.. మరో వైపు బాలీవుడ్‌నూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బాలీవుడ్‌లో ఓ మూవీ ఆఫర్‌ను రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. షాహిద్ కపూర్, రష్మికను హీరో-హీరోయిన్లుగా పెట్టి ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేశారు దర్శకుడు అమిత్ శర్మ. ఇందులో నటించేందుకు షాహిద్ దాదాపు ఓకే చెప్పారు. రష్మిక మాత్రం సున్నితంగా ఈ ఆఫర్‌ని తిరస్కరించారు.
దీనికి కారణం విజయ్‌తో పెళ్లే కారణమని తెలుస్తోంది. ఈ నెలాఖరులో రౌడీబాయ్తో పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ సైతం ప్లాన్ చేస్తున్నారు. అలా పెళ్లి, రిసెప్షన్ తర్వాత కొంత కాలం కెరీర్‌లో గ్యాప్ తీసుకోవాలని రష్మిక భావిస్తోంది. అందుకే రష్మిక అమిత్ శర్మ ప్రాజెక్టును తిరస్కరించారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది.
నిజానికి షాహిద్-రష్మిక కలిసి ఓ సినిమా చేస్తున్నారు. కాబట్టి ఇద్దర్నీ మరో సినిమాకు ఒప్పించడం పెద్ద కష్టం కాదనుకున్నాడు దర్శకుడు అమిత్ భావించారు. కానీ, రష్మిక పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకోవడం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంటూ బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రష్మిక జోరు కాస్త తగ్గించింది. ప్రస్తుతం ఆమె చేతిలో షాహిద్‌తో నటిస్తున్న కాక్‌టైల్-2, తెలుగులో మైసా మూవీలు ఉన్నాయి. కాక్‌టైల్-2 దాదాపు పూర్తయింది. మైసా మూవీ మాత్రం ఇంకా సెట్స్‌లో ఉంది. చివరిగా హిందీలో ‘థామా’ మూవీలో, తెలుగులో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నటించింది.
ఇదిలా ఉండగా.. రష్మిక ఈ నెల 26న విజయ్ దేవరకొండను వివాహం చేసుకోనున్నది. వీరిద్దరి పెళ్లి ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరుగనున్నది. సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది. మార్చి 4న హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. సౌత్ సినిమాతో పాటు బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు రిసెప్షన్ కోసం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయ్–రష్మిక పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



