Anand Deverakonda | ఆనంద్ దేవరకొండ బర్త్‌డే – స్పెషల్‌గా విషెస్ చెప్పిన వదిన రష్మిక
మరిది ఆనంద్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా వదిన రష్మిక మందన్న స్పెషల్‌గా విషెస్ చెప్పింది. రష్మిక పోస్ట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Mar 15, 2026, 5.46 pm IST
Anand Deverakonda | టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఆదివారం తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆనంద్ దేవరకొండకు వదిన రష్మిక మందన్న స్పెషల్‌గా విషెస్ చెప్పింది. విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న ఇటీవలే ఏడడుగులు వేసింది. ఈ జంట వివాహ వేడుకలు వారం రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో విజయ్, రష్మిక పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను నిర్వహించారు. ఇటీవలే వెకేషన్‌ను ముగించుకున్న విజయ్, రష్మిక హైదరాబాద్‌కు వచ్చారు. సోమవారం నుంచి తిరిగి షూటింగ్‌లతో బిజీ కానున్నారు.
సోషల్ మీడియా ద్వారా...
కాగా ఆదివారం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా రష్మిక మందన్న మరిదికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. విజయ్, ఆనంద్‌లతో కలిసి వెకేషన్‌కు వెళ్లినప్పటి ఓ ఫొటోతో పాటు ఆనంద్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ రెండు ఫొటోలను విజయ్ తీసినట్లు పేర్కొన్నది.
ఆనందా...
"ఆనందా....నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ..నువ్వు షూటింగ్‌లో బిజీగా ఉండి మాకు దూరంగా ఉన్నావు, నిన్ను చాలా మిస్సవుతున్నాం" అంటూ మరిదికి విషెస్ చెప్పింది. "మనమంతా ఎప్పడూ ఇలాగే ఆనందంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నానని" అన్నది. రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.విజయ్ దేవరకొండ కూడా తమ్ముడికి బర్త్‌డే విషెస్ చెబుతూ అతడితో కలిసి దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మూడు సినిమాలతో బిజీ...
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఎపిక్, డ్యూయెల్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతుండగా...తక్షకుడు మాత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఎపిక్ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తక్షకుడు మూవీలో ఆనంద్ దేవరకొండ అంధుడి పాత్రలో కనిపించబోతున్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



