లోడ్ అవుతోంది...


Jana Nayagan Censor Case | జననాయగన్ సెన్సార్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఎస్‌ఫీ వద్ద మొదలైన ఈ వివాదం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చేరుకుంది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా బోర్డు అడ్డుకోవడంపై మేకర్స్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. తాజాగా జననాయగన్ సెన్సార్ సమస్యపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాను బీజీపీనే అడ్డుకుంటుందని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టారు రాహుల్ గాంధీ.
"కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జననాయగన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక రకంగా ఇది తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి. జననాయగన్‌ను అణిచివేస్తూ తమిళ ప్రజల గొంతును నొక్కాలని మోదీ అనుకుంటున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు" అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. సీబీఎఫ్‌సీని అడ్డుపెట్టుకొని మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందంటూ పలువురు కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు కూడా కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. కావాలనే విజయ్ సినిమాకు అడ్డంకులను సృష్టిస్తున్నారని అంటున్నారు. జననాయగన్ సెన్సార్ ఇష్యూ రాజకీయ రంగు పలుముకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీని జనవరి 9న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ సీబీఎఫ్‌సీ ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. సెన్సార్ జాప్యంపై మేకర్స్ హైకోర్టును ఆశ్రయించారు. జననాయగన్‌కు యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. సింగిల్ బెంచ్ తీర్పుపై కూడా సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్ వద్ద పిటీషన్ వేసింది. దాంతో మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై స్టే విధించడమే కాకుండా సినిమా రిలీజ్‌కు అనమతులు ఇవ్వాలని కోరారు. జననాయగన్ సెన్సార్ కేసును జనవరి 21కి సుప్రీంకోర్టు వాయిదావేసింది. ఈ వాయిదాతో విజయ్ మూవీ జనవరిలో రిలీజ్ కావడం అనుమానంగా మారింది.
జననాయగన్‌లోని పొలిటికల్ డైలాగ్స్‌పై మేకర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్‌జీఆర్ రిఫరెన్స్‌తో పాటు ప్రభుత్వ పనితీరు గురించి ఉన్న డైలాగ్స్‌ను తొలగించాలని సీబీఎఫ్‌సీ పేర్కొన్నారు. మేకర్స్ మాత్రం అందుకు ఒప్పుకోకపోవడంతో ఇష్యూ కోర్టు వరకు వెళ్లింది.
జననాయగన్ మూవీకి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలకృష్ణ హీరోగా నటించిన తెలుగు మూవీ భగవంత్ కేసరికి రీమేక్‌గా జననాయగన్ తెరకెక్కుతోంది.
The I&B Ministry’s attempt to block ‘Jana Nayagan’ is an attack on Tamil culture.
Mr Modi, you will never succeed in suppressing the voice of the Tamil people.
— Rahul Gandhi (@RahulGandhi) January 13, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam