త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagavamsi | నేనేమైనా సాగ‌రం సంగ‌మం తీశానా – ఫంకీ రిజ‌ల్ట్‌పై ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌

ఫంకీ రిజ‌ల్ట్‌పై నిర్మాత నాగ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తానేం సాగ‌ర సంగ‌మం చేయ‌లేద‌ని, సిల్లీ కామెడీ సినిమానే తీశాన‌ని అన్నారు. విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ఈ మూవీకి కేవీ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

N

Entertainment | Published On Feb 13, 2026, 6.07 pm IST

Nagavamsi | నేనేమైనా సాగ‌రం సంగ‌మం తీశానా – ఫంకీ రిజ‌ల్ట్‌పై ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌
Advertisement

Nagavamsi | విశ్వ‌క్‌సేన్ హీరోగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫంకీ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మించారు. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. ఫంకీ మూవీకి వ‌స్తోన్న రెస్పాన్స్‌పై నిర్మాత నాగ‌వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తానేం సాగ‌ర సంగ‌మం తీయ‌లేద‌ని అన్నారు.

అతుకులుగా....

ఫంకీ సినిమాను శుక్ర‌వారం మార్నింగ్ చూసిన చాలా మంది సినిమాలో ఫ్లో లేదు, అతుకులు అతుకులుగా ఉంద‌ని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నార‌ని నాగ‌వంశీ అన్నారు. "సీన్ల కోస‌మే క‌థ రాసుకున్న‌ట్లుగా ఉంద‌ని విమ‌ర్శిస్తున్నారు. మేమేం సాగ‌రం సంగమం తీయ‌డం లేద‌ని, సిల్లీ కామెడీ సినిమా చేస్తున్నామ‌ని ముందే చెప్పాం. వ‌న్ లైన‌ర్ జోక్స్ మీదే ఈ క‌థ సాగుతుంద‌ని అన్నాం. అయినా కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు" అని నాగ‌వంశీ అన్నారు.

రివ్యూవ‌ర్స్‌కు న‌చ్చ‌దు...

"రివ్యూవ‌ర్స్‌కు ఫంకీ న‌చ్చ‌ద‌ని ముందే అనుకున్నాం. సినిమా ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో క‌థ‌లు రాసుకోవ‌డం రిస్కే. డివైడ్ టాక్ కూడా ఊహించిందే. సినిమాకు కావాల్సిన గ్రామ‌ర్ అయితే ఈ సినిమా లేదు. అది తెలిసే మేము సినిమా తీశాం. డీప్‌గా స్టోరీ గురించి ఆలోచించ‌కుండా కేవ‌లం న‌వ్వుకోవ‌డానికే థియేట‌ర్ల‌కు ర‌మ్మ‌ని ఆడియెన్స్‌కు చెబుతున్నాం. కానీ డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. తాము పెట్టిన 150 రూపాయ‌లకు న్యాయం చేసింద‌ని ఆడియెన్స్ అంటున్నారు. అనుదీప్ చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో ఈ సినిమా తీశాడు. నిర్మాత‌గా నేను హ్యాపీగా ఉన్నా" అని నాగ‌వంశీ పేర్కొన్నారు. ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.
ప్రొడ్యూస‌ర్ కూతురితో ప్రేమ‌లో ప‌డిన సినీ డైరెక్ట‌ర్ క‌థ‌తో అనుదీప్ ఫంకీ మూవీని రూపొందించారు. ఇండ‌స్ట్రీపై ఈ సినిమాలో చాలానే సెటైర్లు వేశారు. ఫంకీ మూవీలో నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో పాటు దిల్‌రాజు, హ‌రీశ్ శంక‌ర్‌, క‌ళ్యాణ్ శంక‌ర్‌తో పాటు మూవీ డైరెక్ట‌ర్ అనుదీప్ గెస్ట్ రోల్స్ చేశారు. భీమ్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

Advertisement
Advertisement