త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prakash Raj | రాముడిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు – ప్ర‌కాష్ రాజ్‌కు లీగ‌ల్ నోటీసులు…

రామాయ‌ణంతో పాటు రామ‌ల‌క్ష్మ‌ణుల‌పై ప్ర‌కాష్ రాజ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై హిందూ సంఘాలు మండిప‌డుతున్నాయి. తాజాగా ప్ర‌కాష్ రాజ్‌కు టీటీడీ బోర్డ్ మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి లీగ‌ల్ నోటీసులు పంపించారు. ప్ర‌కాష్ రాజ్ క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ఆయ‌న‌పై వంద కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేస్తార‌ని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

N

Entertainment | Published On Apr 18, 2026, 6.43 pm IST

Prakash Raj | రాముడిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు – ప్ర‌కాష్ రాజ్‌కు లీగ‌ల్ నోటీసులు…
Advertisement

Prakash Raj | విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రామాయ‌ణంతో పాటు శ్రీరాముడిపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై హిందూ సంఘాలు మండిప‌డుతున్నాయి. రామ‌ల‌క్ష్మ‌ణులు వ‌ల‌స కూలీలు అంటూ ప్ర‌కాష్ రాజ్ చేసిన కామెంట్లపై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు సంబంధించి ప్ర‌కాష్ రాజ్‌పై ఇప్ప‌టికే కేర‌ళ‌తో పాటు ఢిల్లీలో పోలీసు కేసులు న‌మోదు అయిన‌ట్లు స‌మాచారం.

క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే...

తాజాగా ప్ర‌కాష్ రాజ్‌కు టీటీడీ బోర్డ్ మెంబ‌ర్ భాను ప్ర‌కాష్ రెడ్డి లీగ‌ల్ నోటీసులు పంపించారు. రామాయ‌ణంపై ప్ర‌కాష్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు హిందువులు మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని భాను ప్ర‌కాష్ రెడ్డి ఆరోపించారు. హిందూ ధ‌ర్మాన్ని, విశ్వాసాల‌ను అవ‌మానించేలా ఉద్దేశ‌పూర్వ‌కంగానే ప్ర‌కాష్ రాజ్ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించి వారం రోజుల్లోపే హిందువులంద‌రికి ప్ర‌కాష్ రాజ్ బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని భాను ప్ర‌కాష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్ర‌కాష్ రాజ్‌పై వంద కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని లీగ‌ల్ నోటీసుల్లో పేర్కొన్నారు.

అహంకార‌మే...

ప్ర‌కాష్ రాజ్‌పై జ‌న‌సేన ఎమ్ఎల్‌సీ, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా ఫైర్ అయ్యారు. శ్రీరాముడు హిందూ ధ‌ర్మానికి ప్ర‌తీక అని, ఆయ‌న్ని అవ‌మానించ‌డం అహంకార‌మే అవుతుంది. మాన‌సిక అంధ‌త్వం వ‌ల్ల జ‌రిగే పొర‌పాటు ఇదంటూ ప్ర‌కాష్ రాజ్‌పై విరుచుకుప‌డ్డారు. నాస్తికత్వం అంటే దేవుళ్ల‌ను ఎగ‌తాళి చేయ‌డం, అవ‌మానించ‌డం కాద‌ని నాగ‌బాబు అన్నారు.

వ‌ల‌స కూలీలు...

ఇటీవ‌ల జ‌రిగిన కేర‌ళ లిట‌రేచ‌ర్ ఫెస్టివ‌ల్‌కు ఓ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు ప్ర‌కాష్ రాజ్‌.ఈ వేడుక‌లో శ్రీరాముడితో పాటు ల‌క్ష్మ‌ణుడు ఉత్తర భార‌తం నుంచి ద‌క్షిణాదికి వ‌ల‌స వ‌చ్చిన కూలీలుగా ప్ర‌కాష్ రాజ్ పేర్కొన్నారు. ద‌క్షిణాదిలో గిరిజ‌న తెగ‌కు చెందిన రావ‌ణుడి తోట‌లో పండ్ల‌ను దొంగిలించార‌ని, అదే యుద్ధానికి దారితీసింద‌ని ప్ర‌కాష్ రాజ్ అన్నారు.

Advertisement
Advertisement