త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Re Release | రీ రిలీజ్‌లో కుమ్మేసిన ప్ర‌భాస్ డార్లింగ్ – టాప్ ఫైవ్ సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్‌

ప్ర‌భాస్ డార్లింగ్ మూవీ రీ రిలీజ్‌లోనూ రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు రీ రిలీజ్‌ల‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. మూడు రోజుల్లోనే 7.75 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకుంది.

N

Entertainment | Published On Apr 26, 2026, 3.41 pm IST

Re Release | రీ రిలీజ్‌లో కుమ్మేసిన ప్ర‌భాస్ డార్లింగ్ – టాప్ ఫైవ్ సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్‌
Advertisement

Re Release | ప్ర‌భాస్ డార్లింగ్ మూవీ రీ రిలీజ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టింది. ఈ వారం రిలీజైన స్ట్రెయిట్ సినిమాల‌కు మించి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగు రీ రిలీజ్‌ల‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఒక‌టిగా డార్లింగ్‌ రికార్డ్ క్రియేట్ చేసింది.

తొలిరోజు అదుర్స్‌...

ప్ర‌భాస్ హీరోగా క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యామిలీ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 23న మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చారు. తొలి రోజే 4.82 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ర‌చ్చ‌చేసింది. రెండో రోజు 93 ల‌క్ష‌లు, మూడో రోజు 77 ల‌క్ష‌ల‌తో స‌త్తా చాటింది. ఓవ‌రాల్‌గా మూడు రోజుల్లో డార్లింగ్ 7.75 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. నైజాంలో అత్య‌ధికంగా నాలుగు కోట్ల‌కుపైగా ఈ సినిమాకు వ‌సూళ్లు వ‌చ్చాయి. బాహుబ‌లి ఎపిక్‌, ఖ‌లేజా, మురారి...త‌ర్వాత నైజాం ఏరియాలో రీ రిలీజ్ మూవీస్ క‌లెక్ష‌న్స్‌లో డార్లింగ్ నాలుగో ప్లేస్‌లో నిలిచింది.

ఐదో స్థానంలో...

ఓవ‌రాల్‌గా రీ రిలీజ్ సినిమాల్లో 51 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో బాహుబ‌లి ఎపిక్ ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో నిలిచింది. బాహుబ‌లి త‌ర్వాత ఖ‌లేజా (10.78 కోట్లు), మురారి (8.90 కోట్లు). గ‌బ్బ‌ర్ సింగ్ (8 కోట్లు) ఉన్నాయి. ఈ మూడు సినిమాల త‌ర్వాత 7. 75 కోట్ల‌తో డార్లింగ్ ఐదో ప్లేస్‌ను సొంతం చేసుకుంది.ఈ వారం థియేట‌ర్ల‌లో వాలా 2, గేదేల‌రాజు, ప‌ర‌మ‌ప‌ద‌సోపానంతో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాలు రిలీజ‌య్యాయి. క‌లెక్ష‌న్స్ విష‌యంలో కొత్త సినిమాలేవి డార్లింగ్‌కు ద‌రిదాపుల్లో కూడా నిల‌వ‌లేక‌పోయాయి.

కామెడీ టైమింగ్‌...

డార్లింగ్ మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించింది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు ల‌వ్‌స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌ణ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప్ర‌భాస్ కామెడీ టైమింగ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో అత‌డి కెమిస్ట్రీ సినిమాతో పాటు జీవీ ప్ర‌కాష్ మ్యూజిక్ కూడా సినిమా విజ‌యంలో కీల‌కంగా నిలిచాయి.

 

Advertisement
Advertisement