Payal Rajput | కన్నీళ్లు పెట్టుకున్న పాయల్ రాజ్‌పుత్.. అసలు ఏం జరిగిందంటే..?
Payal Rajput | తెలుగు ప్రేక్షకులకు ‘ఆర్‌ఎక్స్ 100’తో పరిచయమైన నటి పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఫస్ట్ టైమ్ 01-01-01 ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా కన్నీళ్లు ఆపుకోలేక వేదికను మధ్యలోనే వెళ్లిపోవడం అక్కడున్న వారిని కదిలించింది.
Entertainment | Published On Apr 29, 2026, 11.25 am IST
Payal Rajput | తెలుగు ప్రేక్షకులకు ‘ఆర్‌ఎక్స్ 100’తో పరిచయమైన నటి పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఫస్ట్ టైమ్ 01-01-01 ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా కన్నీళ్లు ఆపుకోలేక వేదికను మధ్యలోనే వెళ్లిపోవడం అక్కడున్న వారిని కదిలించింది. దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె స్నేహితుడు సౌరభ్ ధింగ్రా హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాయల్ సినిమా గురించి మాట్లాడుతూ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేసింది.
అయితే, కార్యక్రమం చివరలో విలేకరులు అడిగిన ఒక ప్రశ్న ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. గతంలో తాను జైపూర్‌లో విపాసన ధ్యానం చేసిన విషయాన్ని ప్రస్తావించగా.. ఆమె తన వ్యక్తిగత జీవితంలోని కఠినమైన రోజులను గుర్తు చేసుకున్నారు. తండ్రికి క్యాన్సర్ నిర్ధారణ అయిన సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని వివరించారు. ‘మా నాన్నే నా జీవితానికి నిజమైన హీరో. ఆయన లేకపోవడం ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నాను’ అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. ఆ సమయంలో తాను పూర్తిగా విరిగిపోయినట్టుగా అనిపించిందని, తల్లిని ఎలా ఆదుకోవాలో, తానే ఎలా ధైర్యంగా ఉండాలో అర్థంకాక ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. తండ్రి తన నటనపై ఎప్పుడూ నిజాయితీగా స్పందించేవారని, తన సినిమాలు చూసి అభిప్రాయాలు చెప్పడం ఆయనకు ఎంతో ఇష్టమని గుర్తుచేసుకున్నారు.
ఇలా మాట్లాడుతుండగానే పాయల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. భావోద్వేగానికి లోనై మాట్లాడలేని స్థితికి చేరుకోవడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే విడిచి వెళ్లిపోయారు. గత ఏడాది తన తండ్రి మరణం ఆమెపై ఎంతటి ప్రభావం చూపిందో ఈ ఘటన మరోసారి వెల్లడించింది. కష్టకాలంలో మానసిక ప్రశాంతత కోసం ఆమె విపాసన ధ్యానాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించారు. వ్యక్తిగతంగా ఎదురైన దుఃఖాన్ని తట్టుకోవడంలో అది కొంత వరకు తోడ్పడిందని తెలిపారు. ఇక పాయల్ సపోర్ట్ చేస్తున్న ‘ఫస్ట్ టైమ్ 01-01-01’ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌లో ఆమె భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాయల్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో కార్తీక, తమిళంలో గోల్‌మాల్ సినిమాల్లో నటిస్తోంది.
Actress Payal Rajput gets emotional while answering and walks away pic.twitter.com/ysuvKFdaxZ
— idlebrain.com (@idlebraindotcom) April 28, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



