త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan | ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా త‌క్కువ రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?

N

Entertainment | Published On Mar 7, 2026, 6.21 pm IST

Pawan Kalyan | ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?
Advertisement

Pawan Kalyan |  ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మార్చి 19న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. తొలుత ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ య‌శ్ టాక్సిక్ వాయిదాప‌డ‌టంతో వారం ముందుగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు విడుద‌ల చేస్తున్నారు.

డ‌బ్బింగ్ షురూ...

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను చ‌క‌చ‌కా పూర్తిచేసే ప‌నిలో ప‌డ్డారు మేక‌ర్స్‌. శ‌నివారం నుంచి ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ‌బ్బింగ్‌ మొద‌లుపెట్టారు. ప‌వ‌ర్ స్టార్‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ దిగిన ఓ ఫొటోను నిర్మాత‌లు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. మార్చి 11న ఉస్తాద్ ట్రైల‌ర్ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెమ్యూన‌రేష‌న్....

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాక్ష‌న్ మూవీ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేవ‌లం 25 కోట్ల రెమ్యూన‌రేష‌న్ మాత్ర‌మే అందుకున్న‌ట్లు చెబుతోన్నారు. పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్ కార‌ణంగా టాలీవుడ్ హీరోలంద‌రూ రెమ్యూన‌రేష‌న్లు భారీగా పెంచేశారు. ఒక్కో సినిమాకు యాభై కోట్ల నుంచి వంద కోట్ల మ‌ధ్య తీసుకుంటున్నారు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం చాలా త‌క్కువ పారితోషికం అందుకోవ‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు రిలీజ్ విష‌యంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ చేసిన సాయంతో పాటు షూటింగ్ డిలే వ‌ల్ల నిర్మాత‌ల‌కు ఏర్ప‌డిన ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకొని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ఎలాంటి డిమాండ్స్ చేయ‌లేద‌ని టాక్ వినిపిస్తోంది.

రిలీజ్‌కు ముందే లాభాల్లోకి...

ప‌వ‌న్ డెసిష‌న్‌తో రిలీజ్‌కు ముందే మైత్రీ మూవీ మేక‌ర్స్ లాభాల్లోకి అడుగుపెట్టిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 80 కోట్ల‌కు కొనుగోలు చేసింది. శాటిలైట్‌, ఆడియో రైట్స్‌తో నిర్మాత‌ల‌కు భారీగానే గిట్టుబాటు అయ్యింద‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ కార‌ణంగా థియేట్రిక‌ల్ బిజినెస్ కూడా భారీగానే జ‌రిగిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.
ఓజీ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న ఈ సినిమాలో శ్రీలీల‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తేరీ రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఈ రూమ‌ర్ల‌ను ఇటీవ‌ల హ‌రీష్ శంక‌ర్ ఖండించారు.

Advertisement
Advertisement