త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Renu Desai | అస‌భ్యంగా కామెంట్లు చేస్తే ఊరుకోను – ఇంటికొచ్చి నిల‌దీస్తా – ట్రోల‌ర్స్‌కు రేణుదేశాయ్ వార్నింగ్‌

సోష‌ల్ మీడియాలో త‌న‌ను ట్రోల్ చేస్తున్న వారికి రేణు దేశాయ్ వార్నింగ్ ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో ఇక‌పై త‌న గురించి అస‌భ్య కామెంట్లు చేస్తే చూస్తూ ఊరుకోన‌ని అన్న‌ది. పోలీసుల‌కు కంప్లైంట్ చేస్తాన‌ని హెచ్చ‌రించింది.

N

Entertainment | Published On Feb 28, 2026, 8.34 pm IST

Renu Desai | అస‌భ్యంగా కామెంట్లు  చేస్తే ఊరుకోను – ఇంటికొచ్చి నిల‌దీస్తా – ట్రోల‌ర్స్‌కు రేణుదేశాయ్ వార్నింగ్‌
Advertisement

Renu Desai |  సోష‌ల్ మీడియాలో త‌న‌ను ట్రోలింగ్ చేస్తోన్న వారిపై రేణుదేశాయ్ ఫైర్ అయ్యింది. ఇక‌పై అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్లు చేస్తూ చూస్తూ ఊరుకోన‌ని, పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వ‌డంతో పాటు ఇంటికొచ్చి నిల‌దీస్తాన‌ని హెచ్చ‌రించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో విడాకుల త‌ర్వాత అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తోంది రేణుదేశాయ్‌. సోష‌ల్ మీడియాలో మాత్రం రేణుదేశాయ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న పిల్ల‌ల‌తో పాటు మాజీ భ‌ర్త ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి సోష‌ల్ మీడియాలో రేణు దేశాయ్ చేసిన పోస్ట్‌లు ప‌లుమార్లు వైర‌ల్ అయ్యాయి. పాలిటిక్స్‌, సామాజిక స‌మ‌స్య‌ల‌పై త‌న అభిప్రాయాలు, ఆలోచ‌న‌ల‌ను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటుంది. రేణు దేశాయ్ పోస్ట్‌ల‌పై ప్ర‌శంస‌ల‌తో పాటు అదే స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతుంటాయి. చాలా సార్లు సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది.

న‌న్ను ఎప్పుడైనా క‌లిశారా...

ఇటీవ‌ల తాను పెట్టిన ఓ పోస్ట్‌ను ఉద్దేశించి ఓ నెటిజ‌న్ అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్ చేయ‌డంతో రేణుదేశాయ్ ఫైర్ అయ్యింది. తానేం ఎమ్మెల్యేను, ప్ర‌భుత్వ మ‌నిషిని కాద‌ని రేణు దేశాయ్ అన్న‌ది.
"నన్ను ఎప్పుడైనా కలిశారా? నాతో ఎప్పుడైనా మాట్లాడారా? నేను మిమ్మల్ని కలిశానా? మీకు న‌చ్చ‌ని వ్య‌క్తుల‌ను తిట్ట‌డం ఎంత వ‌ర‌కు న్యాయం ఉందో ఆలోచించండి. ఈ సారి నా గురించి అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్లు చేస్తే ఊరుకోను. పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తాను. అక్క‌డితో ఆగ‌కుండా కామెంట్లు చేసిన వారి ఇంటి వ‌ర‌కు వ‌స్తాను. నా గురించి ఎంత అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్లు చేశారో వారి త‌ల్లిదండ్రుల‌కు, అక్కాచెల్లెళ్ల‌కు చూపిస్తాను. మీవాడికి నేర్పిన సంస్కారం ఇదేనా, ఎలా పెంచారు అని వారిని నిల‌దీస్తాను. అప్పుడు నాకు కాదు..మీ వాళ్ల‌కే మీరు స‌మాధానం చెప్పాల్సివుంటుంది" అని రేణు దేశాయ్ అన్న‌ది.

 

ఎమ్మెల్యేను కాదు...

"నేను సినిమా రంగంలో ఉన్న మ‌హిళ‌ను. అంతే కానీ గవర్నమెంట్ మనిషిని కాదు, ఎమ్మెల్యేని కాదు, ప్రజలు ఎన్నుకున్న వ్య‌క్తిని అంత‌కంటే కాదు. ప్ర‌జ స‌మ‌స్య‌ల‌పై నేను రియాక్ట్ అవుతుంటే నాపై ద్వేషాన్ని ప్ర‌చారం చేస్తున్నారు. అస‌భ్యంగా దూషిస్తున్నారు. నన్ను తిట్టడానికి ఉప‌యోగిస్తున్న శ‌క్తిని, స‌మ‌యాన్ని స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌పై చూపిస్తే బాగుంటుంది. జీవితంలోని సంతోషం లేని వ్య‌క్తులు, మాన‌సికంగా కృంగుబాటులో ఉన్న‌వారే ఇలాంటి నీచ‌మైన కామెంట్లు చేస్తుంటారు"  అని రేణు దేశాయ్ అన్నది. కాశీ టెంపుల్‌లో మాల‌లో ఉన్న ఫొటో పెడితే రాత్రికి రేటు ఎంత అని కామెంట్లు పెట్టారని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. "మీరు చేసే అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్లు మీ వ్య‌క్తిత్వం ఎలాంటిదో చెబుతుంది. నా గురించే కాదు ఏ సెలిబ్రిటీ గురించి కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని కోరుతున్నాను" అని రేణు దేశాయ్ అన్న‌ది.

Advertisement
Advertisement