Biker OTT | 45 కోట్ల బడ్జెట్ – 18 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి శర్వానంద్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ
శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ బైకర్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా కనిపించింది.
Entertainment | Published On Apr 27, 2026, 1.12 pm IST
Biker OTT | శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బైకర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. సీనియర్ కథానాయకుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటించింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు.
నెట్‌ఫ్లిక్స్‌లో...
బైకర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ రిలీజ్ డేట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.
కమర్షియల్ ఫెయిల్యూర్...
మోటోగ్రాక్ బైక్ రేసింగ్ కాన్సెప్ట్‌కు తండ్రీకొడుకుల బంధాన్ని జోడించి దర్శకుడు అభిలాష్ ఈ సినిమాను తెరకెక్కించారు. కాన్సెప్ట్‌తో పాటు శర్వానంద్, రాజశేఖర్ యాక్టింగ్, రేసింగ్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. టెక్నికల్‌గా బ్రిలియంట్ మూవీ అంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచిన ఈ మూవీ నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది.
45 కోట్ల బడ్జెట్...
దాదాపు 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బైకర్ మూవీ ఫుల్ థియేట్రికల్ రన్‌లో కేవలం 18 కోట్ల వసూళ్లను మాత్రమే దక్కించుకుంది. బైకర్ మూవీకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.
విక్కీ కథ...
విక్కీ అలియాస్ వికాస్ నారాయణన్ మోటోక్రాస్ రేసర్. తండ్రి బుల్లెట్ సునీల్ ఆధ్వర్యంలోనే మోటోక్రాస్‌లో ట్రైనింగ్ తీసుకుంటాడు. విక్కీని ఇంటర్నేషనల్ రేసర్‌గా చూడాలన్నది సునీల్ కల. ఇందుకోసం ఓ పెద్ద కంపెనీతో ఒప్పందం చేసుకుంటాడు. కానీ విక్కీ అనూహ్యంగా రేసింగ్ పోటీలకు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. అతడి నిర్ణయం తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని పెంచుతుంది? ఆ తర్వాత ఏమైంది? అసలు విక్కీ లైఫ్‌లోకి వచ్చిన అనన్య ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



