Tollywood | జేడీ చక్రవర్తి మిస్ చేసుకున్న సినిమాతో సోలో హీరోగా రవితేజకు ఫస్ట్ హిట్
మాస్ మహారాజా రవితేజ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమాల్లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ఒకటి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్‌స్టోరీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా రవితేజ ఫస్ట్ ఛాయిస్ కాదట.
Entertainment | Published On Apr 25, 2026, 8.17 pm IST
Tollywood | మాస్ మహారాజా కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమాల్లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ఒకటి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న రోల్స్ చేస్తోన్న రవితేజ సోలో హీరోగా ఈ సినిమాతోనే ఫస్ట్ హిట్‌ను అందుకున్నాడు. స్టార్ హీరోగా రవితేజ మారడానికి తొలి అడుగుగా ఈ సినిమానే నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రవితేజ, పూరి జగన్నాథ్, మ్యూజిక్ డైరెక్టర్ చక్రితో పాటు చాలా మంది జీవితాలకు ఓ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాయి.
గాయపడ్డ సింహం...
అయితే ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదట. ఈ లవ్‌స్టోరీని జేడీ చక్రవర్తితో చేయాలని నిర్మాతలు అనుకున్నారట. ఈ విషయాన్ని గాయపడ్డ సింహం ప్రమోషన్స్‌లో జేడీ చక్రవర్తి బయటపెట్టాడు.
అలా మిస్సయ్యింది...
నిర్మాతలు శేషురెడ్డి, వేణుగోపాల్ రెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్స్. నన్ను హీరోగా పెట్టి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తీయాలని అనుకున్నారు. ఆ టైమ్‌లో నాకున్న కమిట్‌మెంట్స్ కారణంగా ముంబాయి వెళ్లాల్సివచ్చింది. దాంతో సినిమా మిస్సయ్యింది అని జేడీ చక్రవర్తి అన్నారు.
సేతు రీమేక్‌లో...
విక్రమ్ సేతు తెలుగు రీమేక్‌లో కూడా తానే నటించాల్సిందని పూరి జగన్నాథ్ చెప్పారు. స్టోరీ రెడీ అయిన తర్వాత ఆ ఆఫర్‌ను వదులుకోవాల్సివచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత సేతు సినిమాను తెలుగులో రాజశేఖర్ శేషు పేరుతో రీమేక్ చేశారని అన్నాడు.
గాయపడ్డ సింహం మూవీతో కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు జేడీ చక్రవర్తి. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ సినిమాలో ధర్మా అనే క్యారెక్టర్‌లో జేడీ చక్రవర్తి కనిపించబోతున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



