Hero Nikhil | ఏఐ టెక్నాలజీపై హీరో నిఖిల్ కామెంట్స్ – రాజాసాబ్ గురించే అంటూ ఫ్యాన్స్ ఫైర్
స్వయంభూ సినిమాను ఉద్దేశించి హీరో నిఖిల్ చేసిన ట్వీట్ ఫ్యాన్ వార్‌కు దారితీసింది. ఏఐ గురించి నిఖిల్ చేసిన ట్వీట్ ప్రభాస్ రాజాసాబ్‌ను ఉద్దేశించి చేసిందనేనని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Entertainment | Published On Feb 15, 2026, 2.51 pm IST
Hero Nikhil | ఏఐ టెక్నాలజీపై హీరో నిఖిల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌కు దారితీశాయి. నిఖిల్ హీరోగా నటించిన స్వయంభూ టీజర్ ఇటీవల రిలీజైంది. హిస్టారియల్ యాక్షన్‌గా స్వయంభూ మూవీ తెరకెక్కింది. టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నిఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా స్వయంభూ తెరకెక్కుతోంది. పీరియాడికల్ కథతో నిఖిల్ సినిమా చేయడం కూడా ఇదే ఫస్ట్ టైమ్.
ఏఐ వాడలేదు...
స్వయంభూ టీజర్ కొత్త వెర్షన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నిఖిల్. ఈ టీజర్‌ను ఉద్దేశిస్తూ ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల్లో ఏఐని బాగా వాడారని, తాము మాత్రం ఏఐ టెక్నాలజీ లేకుండా స్వయంభూ సినిమా చేశామంటూ కామెంట్ పెట్టాడు.
రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్...
నిఖిల్ కామెంట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏఐని వాడి ఈ సినిమాలోని చాలా సీన్లను తెరకెక్కించినట్లుగా విమర్శలొస్తున్నాయి. ప్రభాస్ వింటేజ్ లుక్‌తో కనిపించే సీన్లు మొత్తం ఏఐతోనే రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. హారర్ సీన్ల కోసం ఏఐ వాడినట్లు చెబుతూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చేసిన ట్వీట్లు, పోస్ట్‌లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఏఐ సీన్లు మొత్తం థియేటర్లలో తేలిపోయాయి. దాదాపు 450 కోట్లతో రూపొందిన రాజాసాబ్ డిజాస్టర్‌గా నిలిచింది.
నెగెటివ్ కామెంట్లు...
ఇన్‌డైరెక్ట్‌గా నిఖిల్ తన ట్వీట్‌లో రాజాసాబ్‌పైనే సెటైర్లు వేసినట్లు నెటిజన్లు చెబుతోన్నారు. తన సినిమాను ప్రమోట్ చేయడం కోసం ఇంకో సినిమాపై నెగెటివ్ కామెంట్లు చేయడం బాగాలేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పక్క సినిమాల గురించి నీకెందుకు అంటూ నిఖిల్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఇద్దరు హీరోయిన్లు...
స్వయంభూ సినిమాలో సంయుక్త మీనన్, నభానటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీతో భరత్ కృష్ణమాచారి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



