త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nidhhi Agerwal | వరుస డిజాస్టర్లతో సైలెంట్‌ అయిన నిధి అగర్వాల్‌.. ఆ మూడు ప్రాజెక్టుల అప్‌డేట్‌ ఎప్పుడో..!

Nidhhi Agerwal | టాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌ ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక కీలక దశను ఎదుర్కొంటోంది. వరుస డిజాస్టర్ల తర్వాత సైలైంట్‌గా మారింది. రాబోయే ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్‌ నటించిన రాజాసాబ్‌ మూవీతో పాటు పవన్‌ కల్యాణ్‌ తెరకెక్కించిన హరిహర వీరమల్లు మూవీల్లో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా మెరిసింది.

P

Entertainment | Published On Apr 1, 2026, 5.20 pm IST

Nidhhi Agerwal | వరుస డిజాస్టర్లతో సైలెంట్‌ అయిన నిధి అగర్వాల్‌.. ఆ మూడు ప్రాజెక్టుల అప్‌డేట్‌ ఎప్పుడో..!
Advertisement

Nidhhi Agerwal | టాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌ ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక కీలక దశను ఎదుర్కొంటోంది. వరుస డిజాస్టర్ల తర్వాత సైలైంట్‌గా మారింది. రాబోయే ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రభాస్‌ నటించిన రాజాసాబ్‌ మూవీతో పాటు పవన్‌ కల్యాణ్‌ తెరకెక్కించిన హరిహర వీరమల్లు మూవీల్లో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా మెరిసింది. ఈ రెండు ప్రాజెక్టులు భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయ్యాయి. బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. అయితే, ఆయా సినిమాల్లో నిధి గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మాత్రం మంచి స్పందన లభించింది.

ఈ రెండు చిత్రాల విడుదల సమయంలో తెలుగుతో పాటు తమిళంలో మూడు కొత్త ప్రాజెక్టులకు సైన్‌ చేసినట్లుగా నిధి వెల్లడించింది. ఆ ప్రకటనల తర్వాత ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్డేట్‌లు రాకపోవడం గమనార్హం. దీంతో ఆమె తదుపరి లైన్‌ప్‌పై అనిశ్చితి నెలకొంది. ఇండస్ట్రీలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో సరైన కథలు, పాత్రలు ఎంపిక చేసుకోవడంలో నిధి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మాత్రం నిధి అగర్వాల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇటీవల ఒక కండోమ్ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా ఆమె చేసిన పోస్టులు చర్చనీయాంశంగా మారాయి.

ఈ చర్యతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా తన ఇమేజ్‌ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కెరీర్‌లో వచ్చిన ఈ తాత్కాలిక విరామాన్ని అవకాశంగా మార్చుకుని, మరింత బలంగా తిరిగి రావాలనే లక్ష్యంతో నిధి ముందుకు సాగుతున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. సరైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తే, మరోసారి టాలీవుడ్‌లో తన స్థానాన్ని బలపరుచుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై నిధి అగర్వాల్ ఎలాంటి కథను ఎంచుకుంటుంది? ఎప్పుడు తన కొత్త సినిమా ప్రకటిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె రీ ఎంట్రీ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Advertisement
Advertisement