Priyanka Chopra | విడాకుల బాటలో ప్రియాంక చోప్రా – హాలీవుడ్ మీడియాలో రూమర్లు
నిక్ జోనస్, ప్రియాంక చోప్రా విడాకుల వార్తలు మరోమారు హాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవలే ప్రియాంక చోప్రాకు నిక్ జోనస్ విడాకుల నోటీసులు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Feb 1, 2026, 12.41 pm IST
Priyanka Chopra | నిక్ జోనస్, ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతున్నట్లు చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై నిక్ జోనస్‌తో పాటు ప్రియాంక పలుమార్లు బదులు ఇచ్చారు. రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విడాకుల రూమర్స్‌కు చెక్ పెడుతూ వచ్చారు నిక్, ప్రియాంక. వేర్వేరు దేశాలు, భిన్న సంస్కృతులకు చెందిన ఓ ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు మనస్పర్థలు రావడం సహజం అంటూ ప్రియాంక చోప్రా ఇటీవల నిక్‌తో విభేదాలపై క్లారిటీ ఇచ్చింది. నిక్‌తో గొడవలు ఉన్న మాట నిజమే కానీ విడాకులు తీసుకుంటున్నామని మాత్రం అబద్ధమని చెప్పింది. కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు సెలిబ్రిటీ, కామన్ మ్యాన్స్... ఎవరిజీవితంలోనైనా ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగిపోవడం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నానని ప్రియాంక అన్నది.
మరోమారు హల్‌చల్...
నిక్, ప్రియాంక విడాకుల వార్తలు మరోమారు హాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవలే ప్రియాంక చోప్రాకు నిక్ విడాకుల నోటీసులు పంపించినట్లు చెబుతున్నారు. ఆస్తుల విషయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు పుకార్లు ప్రచారం జరుగుతోంది.
వెడ్డింగ్ రింగ్ లేకుండా....
ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కలిసే అటెండ్ అయ్యారు. కానీ కార్యక్రమం మధ్యలోనే ప్రియాంకను వదిలేసి నిక్ వెళ్లిపోయినట్లు సమాచారం. ఇటీవల నిక్ వెడ్డింగ్ రింగ్ లేకుండా పలు ఈవెంట్లలో కనిపించడం కూడా విడాకుల పుకార్లను బలాన్ని చేకూర్చింది. మరోవైపు పెళ్లి తర్వాత తన పేరును సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా జోనస్‌గా మార్చుకుంది గ్లోబల్ స్టార్. ఇటీవలే తన పేరు నుంచి జోనస్‌ను తొలగించేయడం ఆసక్తికరంగా మారింది. విడాకుల వార్తలను ప్రియాంక చోప్రా అభిమానులు మాత్రం కొట్టిపడేస్తున్నారు. ఇవన్నీ అసత్యాలేనంటూ చెబుతున్నారు.
వారణాసిలో హీరోయిన్‌గా...
నిక్‌తో విభేదాలు తలెత్తడంతోనే ప్రియాంక చోప్రా తిరిగి ఇండియన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీతో ఇండియన్ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. తెలుగులో ప్రియాంక చోప్రా డెబ్యూ మూవీ ఇదే కావడం గమనార్హ. ఈ సినిమా షూటింగ్ కోసం గత ఏడాది కాలంగా ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది ప్రియాంక చోప్రా. వారణాసి షూటింగ్ సెట్స్‌లో నిక్ ఒక్కసారి కూడా కనిపించకపోవడం, ప్రియాంక వెంట ఇండియా రాకపోవడం కూడా ఈ విడాకుల పుకార్లకు బలాన్ని చేకూర్చింది.2018లో నిక్ జోనస్, ప్రియాంక చోప్రా పెళ్లి జరిగింది. క్రిస్టియన్, హిందీ పద్దతుల్లో పెళ్లి చేసుకున్నారు. 2002లో సరోగసీ ద్వారా కూతురు మాల్తీకి జన్మనిచ్చింది ప్రియాంక.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



