త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | రాకాస హీరోయిన్‌తో నారా రోహిత్ రొమాంటిక్ కామెడీ మూవీ – కొర‌టాల క్లాప్‌తో షురూ

రాకాస బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌య‌న్ సారిక త‌న నెక్స్ట్ సినిమాలో నారా రోహిత్‌తో జోడీ క‌ట్ట‌బోతుంది. రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ సినిమాతో చినిమిల్లి మ‌ణికుమార్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

N

Entertainment | Published On May 11, 2026, 5.26 pm IST

Tollywood | రాకాస హీరోయిన్‌తో నారా రోహిత్ రొమాంటిక్ కామెడీ మూవీ – కొర‌టాల క్లాప్‌తో షురూ
Advertisement

Tollywood | ఇటీవ‌లే రాకాస మూవీతో పెద్ద హిట్‌ను అందుకుంది యంగ్ హీరోయిన్ న‌య‌న్ సారిక‌. సుబ్బ‌ల‌క్ష్మి అనే ట్రెడిష‌న‌ల్ రోల్‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. రాకాస స‌క్సెస్ త‌ర్వాత న‌య‌న్ ఓ రొమాంటిక్ కామెడీ మూవీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నారా రోహిత్ హీరోగా న‌టిస్తోన్న ఈ కొత్త సినిమా సోమ‌వారం మొద‌లైంది. హైద‌రాబాద్‌లో ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. నాయ‌కానాయిక‌ల‌పై చిత్రీక‌రించిన తొలి స‌న్నివేశానికి డైరెక్ట‌ర్ కొర‌టాల శివ క్లాప్ నిచ్చారు. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో దిల్‌రాజు, చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ....

నారా రోహిత్‌, న‌య‌న్ సారిక హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీతో చినిమిల్లి మ‌ణికుమార్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ల‌వ్‌, కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ సాగుతుంద‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని అన్నారు. ఈ సినిమాలో వీకే న‌రేష్‌, రోహిణి, సంప‌త్‌, అజ‌య్‌, వెన్నెల‌కిషోర్‌, సుద‌ర్శ‌న్‌, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. నారా రోహిత్ హీరోగా న‌టిస్తోన్న 23వ సినిమా ఇది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించి ఈ ఏడాదే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. భ‌ర‌త్ చౌద‌రి నిర్మిస్తున్నారు.

 

Advertisement
Advertisement