త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagarjuna | డేట్ మార్క్ చేసుకోండి.. సోగ్గాడే చిన్ని నాయ‌నా మూడో పార్ట్ క‌న్ఫామ్.. సంక్రాంతి బ‌రిలో నాగ్‌

నాగార్జున బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ సోగ్గాడే చిన్ని నాయ‌నాకు మూడో పార్ట్ రాబోతుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. పార్ట్ 3ని ఉద్దేశించి ఆదివారం అన్న‌పూర్ణ స్టూడియోస్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Feb 8, 2026, 7.41 pm IST

Nagarjuna | డేట్ మార్క్ చేసుకోండి.. సోగ్గాడే చిన్ని నాయ‌నా మూడో పార్ట్ క‌న్ఫామ్.. సంక్రాంతి బ‌రిలో నాగ్‌
Advertisement

Nagarjuna | 2027 సంక్రాంతి బ‌రిలో నాగార్జున నిల‌వ‌డం ఖ‌రారైంది. షూటింగ్ కూడా మొద‌లుకాక‌ముందే రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి మూడో పార్ట్ చేయ‌బోతున్నారు. నాగార్జున హీరోగా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయ‌నా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాకు బంగార్రాజు పేరుతో సీక్వెల్ కూడా వ‌చ్చింది. ఈ సీక్వెల్‌లో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య న‌టించారు. ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టింది.తాజాగా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది.

సోగ్గాళ్లు పండ‌గ‌కు వ‌స్తే...

మూడో పార్ట్‌కు సంబంధించి అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ ఆదివారం చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. వాసివాడి తస్సాదియ్యా 2027 జనవరి 15న‌ సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా. డేట్ మార్క్ చేసుకోండి అంటూ అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ ట్వీట్‌లో పేర్కొన్న‌ది.

పాపుల‌ర్ డైలాగ్‌...

సోగ్గాడే చిన్ని నాయ‌నాలో నాగార్జున వాడిన వాసివాడి తస్సాదియ్యా అనే డైలాగ్ పాపుల‌ర్ అయ్యింది. ఈ డైలాగ్‌ను ట్వీట్‌లో ఉప‌యోగించ‌డంతో సోగ్గాడే చిన్ని నాయ‌నాకు మూడో పార్ట్ రావ‌డం క‌న్ఫామ్ అని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. సోగ్గాడే చిన్ని నాయ‌నా, బంగార్రాజు సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ఈ మూవీ పార్ట్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇప్ప‌టికే పార్ట్ 3 క‌థ‌ను క‌ళ్యాణ్ కృష్ణ సిద్ధం చేశాడ‌ట‌. ఇటీవ‌లే నాగార్జునకు వినిపించిన‌ట్లు తెలిసింది. ఈ మూడో పార్ట్‌లో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య హీరోలుగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.
ప్ర‌స్తుతం వందో సినిమాతో నాగార్జున‌ బిజీగా ఉన్నారు. రా కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ స‌మ్మ‌ర్‌తో కంప్లీట్ కానుంది. ఆ త‌ర్వాత సోగ్గాడే చిన్ని నాయ‌నా పార్ట్ 3ని సెట్స్‌పైకి తీసుకురానున్నార‌ట‌.కాగా 2027 సంక్రాంతికి నాగార్జున‌తో పాటు చిరంజీవి, వెంక‌టేష్‌, బాల‌కృష్ణ సినిమాలు కూడా రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌లుగురు టాప్ హీరోలు సంక్రాంతికి పోటీప‌డ‌నుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement