Sing Geetham Movie | 94 ఏళ్ల వయసులో సింగీతం మ్యాజిక్: ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ ఫాంటసీ ‘సింగ్ గీతం’
94 ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న మ్యూజికల్ ఫాంటసీ ‘సింగ్ గీతం’. వైజాగ్‌లో జరిగిన ఈవెంట్‌లో చిత్ర బృందం పంచుకున్న విశేషాలివే!
Entertainment | Published On May 24, 2026, 11.55 pm IST
Sing Geetham Movie | త్రినేత్ర.న్యూస్ : సృజనాత్మకతకు వయసుతో పనిలేదని, అది కేవలం ఒక నంబర్ మాత్రమే అని లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మరోసారి నిరూపిస్తున్నారు. 94 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ డైరెక్టర్ చైర్ ఎక్కి 'సింగ్ గీతం' (Sing Geetham) అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies), స్వప్న సినిమా బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) నిర్మిస్తున్న ఈ 'ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ ఫాంటసీ' జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’ (Meet Our Vizag Hero) ఈవెంట్‌లో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది.
సింగీతం మార్క్ క్రియేటివిటీ.. తోడైన రాక్ స్టార్ మ్యూజిక్
'పుష్పక్', 'ఆదిత్య 369', 'విచిత్ర సహోదరులు', 'మైఖేల్ మదన కామరాజన్' లాంటి ఎన్నో ఐకానిక్, ట్రెండ్‌సెట్టర్ సినిమాలతో దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాను రీడిఫైన్ చేసిన దార్శనికుడు సింగీతం. ఆయన క్రియేటివిటీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) మ్యూజిక్ తోడవడంతో ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘హలో బాసు’ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.
నాకది డ్రీమ్ కమ్ ట్రూ: హీరో అయాన్
వైజాగ్‌లోని అక్కయ్యపాలెంలో పెరిగిన అయాన్ (Ayaan) ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఇండియన్ సినీ హిస్టరీలో ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదు. వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బ్యానర్‌లో, అదీ సింగీతం గారి డైరెక్షన్‌లో నా ఫస్ట్ సినిమా చేయడం నిజంగా నా డ్రీమ్ కమ్ ట్రూ. ఇలాంటి ఒక స్పెషల్ ప్రాజెక్ట్‌కి నేను హీరో అవుతానని ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు. ఇదొక అద్భుతమైన సినిమా, అన్ని వయసుల వారు ఎంజాయ్ చేస్తారు."
‘నీలాంబరి’ తర్వాత నువ్వే అంటుంటారు: షాలిని
ఈ సినిమాలో ‘గౌరీ’ పాత్రలో నటిస్తున్న పుదుచ్చేరి బ్యూటీ అహల్యా బమ్రూ (Ahalya Bamroo) మాట్లాడుతూ, ఈ సినిమా కోసం తాను ప్రత్యేకంగా తెలుగు నేర్చుకున్నానని, వైజయంతీ మూవీస్‌లో పనిచేయడం తన కల అని చెప్పింది. మరోవైపు, ‘రేణు’ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేస్తున్న షాలిని కొండేపూడి (Shalini Kondepudi).. "నన్ను చూసి మా ఇంట్లో వాళ్లు నీలాంబరి తర్వాత నువ్వే అంటుంటారు" అని నవ్వుతూ చెప్పింది. ఈ క్యారెక్టర్ చాలా కొత్తగా, యూనిక్‌గా ఉంటుందని ఆమె హామీ ఇచ్చింది.
ఆయన కోసమైనా ఈ సినిమా చూడాలి: దేవిశ్రీ ప్రసాద్
ఈ ఈవెంట్‌కి లైవ్ వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. "సింగీతం గారితో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన కోసమైనా ఈ సినిమాను తప్పకుండా చూడాలి. ఇదొక కంప్లీట్ మ్యూజికల్ ఫిల్మ్ (Musical Film). మా టీమ్ అంతా ఎంతో మనసుపెట్టి ఈ సినిమాకు పనిచేశాం" అని చెప్పారు.
చిత్ర బృందం
తారాగణం: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి, బెనర్జీ, శివనారాయణ తదితరులు.
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: నాగ్ అశ్విన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ (DOP): అంకుర్ సి
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



