త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు : ప్రియ‌ద‌ర్శి

Priyadarshi | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శక‌త్వంలో రూపొందిన `ది ప్యార‌డైజ్‌` (The Paradise) చిత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వీక్షించారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో పార్టీ ఎంపీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల‌తో క‌లిసి శ‌నివారం రాత్రి తిల‌కించారు.

G

Entertainment | Published On Sep 27, 2026, 12.14 pm IST

Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు : ప్రియ‌ద‌ర్శి
Advertisement

Priyadarshi | త్రినేత్ర న్యూస్‌: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శక‌త్వంలో రూపొందిన `ది ప్యార‌డైజ్‌` (The Paradise) చిత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వీక్షించారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల‌తో క‌లిసి శ‌నివారం రాత్రి తిల‌కించారు. అనంత‌రం చిత్ర‌బృందంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినంద‌న‌లు తెలిపారు. ఈ సినిమాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) పోలిన‌ ఎమ్మెల్యే శంక‌రన్న పాత్రను ప్రియ‌ద‌ర్శి (Priyadarshi) పోషించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ప్రియ‌ద‌ర్శి స్పందిస్తూ.. కృతజ్ఞుడిని రామన్న అంటూ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేశారు. `పెళ్లిచూపులు నుంచి ప్యారడైజ్‌ వరకు మీరు నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు.` అంటూ ట్వీట్ చేశారు.

ప్యార‌డైజ్ సినిమాలో కేసీఆర్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న‌ది. కేసీఆర్ పోలిన‌ ఎమ్మెల్యే శంక‌ర‌న్న పాత్ర‌కు స‌న్నివేశాలు క‌నిపించ‌గానే అభిమానులు పెద్ద ఎత్తున అరిచారు. ఆ సీన్ రాగానే కేటీఆర్ కూడా చిరున‌వ్వు చిందించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఓ స‌మాజంపై అణిచివేత జ‌రిగిన‌ప్పుడు ఒక నాయ‌కుడు వ‌చ్చి పోరాటం చేసి గుర్తింపు తెచ్చిన క‌థ అద్భుతంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌, యాస‌, భాష‌తో సినిమాను తీర్చిదిద్దార‌ని, ఇది ఎంతో ఆక‌ట్టుకుంద‌ని కొనియాడారు. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెలకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement