త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BAFTA Award | చ‌రిత్ర సృష్టించిన‌ బూంగ్‌.. మ‌ణిపురి చిత్రానికి బాఫ్టా అవార్డు

G

Entertainment | Published On Feb 23, 2026, 7.28 am IST

BAFTA Award | చ‌రిత్ర సృష్టించిన‌ బూంగ్‌.. మ‌ణిపురి చిత్రానికి బాఫ్టా అవార్డు
Advertisement

BAFTA Award | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌ణిపురి చిత్రం `బూంగ్` (Boong) చ‌రిత్ర సృష్టించింది. ఓ స్కూల్‌ పిల్ల‌వాడు త‌ప్పిపోయిన త‌న త‌ల్లిదండ్రులను తిరిగి క‌లిసే క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ సినీ రంగంలో అత్యుత్త‌మ పుర‌స్కారాల్లో ఒక‌టిగా భావించే బ్రిటిష్ అకాడ‌మీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ఆర్ట్స్ (BAFTA) అవార్డు ద‌క్కించుకున్న‌ది. బెస్ట్ చిల్డ్ర‌న్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ విభాగంలో బాఫ్టా అవార్డు (BAFTA award) గెలుపొందింది. దీంతో బాఫ్టా అవార్డు పొందిన తొలి భార‌తీయ చిత్రంగా నిలిచింది. ఫ్రెంచ్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్ష‌న్ ఫిల్మ్ అర్కో, లిలో అండ్ స్టిచ్‌, జూట్రోపొలిస్ 2 వంటి సినిమాల‌తో పోటీప‌డి న్యాయ‌నిర్ణేత‌ల మ‌న‌సు గెలుచుకున్న‌ది. లండ‌న్‌లోని రాయ‌ల్ ఫెస్టివ‌ల్ హాల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సినిమా డైరెక్ట‌ర్ ల‌క్ష్మిప్రియాదేవి (Laskhmipriya Devi) ఈ అవార్డు అందుకున్నారు. ఈ మూవీని బాలీవుడ్ లెజండ‌రీ యాక్ట‌ర్ ఫ‌ర్హాన్ అక్త‌ర్ (Farhan Akhtar) నిర్మించ‌డం విశేషం.

2024లో టొరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ‘డిస్కవరీ’ విభాగంలో ప్రదర్శితమై మొదటగా వార్తలలో నిలిచింది. అనంత‌రం ఇంట‌ర్నేష‌న‌ల్ సౌత్ ఏషియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ లాంటి ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప్ర‌ద‌ర్శిత‌మై ప‌లు విభాగాల్లో పుర‌స్కారాలు ద‌క్కించుకున్న‌ది. టైటిల్ పాత్ర‌లో న‌టించిన గుగున్ కిప్జెన్ త‌న యాక్టింగ్‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో ఈ మూవీ విడుద‌లైంది.

క‌థ ఏంటంటే..

2024లో బూంగ్‌ అనే స్కూల్‌ పిల్లాడి కథతో మ‌హిళా డైరెక్ట‌ర్ లక్ష్మీప్రియాదేవి ఈ చిత్రాన్ని మణిపురి భాషలో తెర‌కెక్కించారు. ఆ పిల్లవాడు తప్పిపోయిన తన తండ్రి జాయ్‌కుమార్‌ని, తన తల్లి మందాకినిని తిరిగి కలపడం కోసం తన స్వస్థలం నుంచి మయన్మార్‌ సరిహద్దు సమీపంలోని మోరే వరకు ప్రయాణించడమే ఇందులోని కథ. బూంగ్‌ తండ్రి బతికే ఉన్నాడా, అతనికి ఏమైంది, ఈ ప్రయాణంలో బూంగ్‌కు ఎదురైన అనుభవాలేమిటనేది డైరెక్ట‌ర్‌ ఆసక్తికరంగా, గుండె చలించేలా చిత్రించారు. 2023లో మణిపుర్‌లో అల్లర్లు జరిగేందుకు సరిగ్గా వారం ముందు ఈ చిత్రాన్ని పూర్తి చేశారు.

మణిపుర్‌లో పుట్టి పెరిగిన లక్ష్మీప్రియ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో పీజీ పూర్తిచేశారు. ఫర్హాన్‌ అక్తర్‌ తీసిన ‘లక్ష్య’ (2004), రాజ్‌కుమార్‌ హిరానీ తీసిన ‘పికె’ (2014) చిత్రాలకు ఫస్ట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

 

Advertisement
Advertisement