త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manchu Manoj | ప‌ద‌వి, ప‌లుకుబ‌డి న్యాయానికి అడ్డు కావ‌ద్దు – బండి సంజ‌య్ కొడుకు పోక్సో కేసుపై మంచు మ‌నోజ్ ట్వీట్

కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ త‌న‌యుడు బండి భ‌గీర‌థ్‌పై న‌మోదు అయిన పోక్సో కేసుపై టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ రియాక్ట్ అయ్యారు. ఈ కేసు విచార‌ణ‌లో జాప్యం జ‌ర‌గొద్ద‌ని పేర్కొన్నారు. ప‌ద‌వి ప‌లుకుబ‌డి న్యాయానికి అడ్డుగా రాకూడ‌ద‌ని త‌న ట్వీట్‌లో మంచు మ‌నోజ్ పేర్కొన్నారు.

N

Entertainment | Published On May 11, 2026, 4.49 pm IST

Manchu Manoj | ప‌ద‌వి, ప‌లుకుబ‌డి న్యాయానికి అడ్డు కావ‌ద్దు – బండి సంజ‌య్ కొడుకు పోక్సో కేసుపై మంచు మ‌నోజ్ ట్వీట్
Advertisement

Manchu Manoj | కేంద్ర‌ హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్‌పై ఇటీవ‌ల‌ పోక్సో కేసు న‌మోదు అయ్యింది. మైన‌ర్ బాలిక‌ను లైంగికంగా వేధించార‌నే ఆరోప‌ణ‌ల‌తో పోలీసులు బండి భ‌గీర‌థ్‌పై కేసు న‌మోదు చేశారు. ఈ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల‌ను కుదిపేస్తుంది. రాజ‌కీయంగా ప్ర‌కంప‌నలను సృష్టిస్తోంది.

మంచు మ‌నోజ్ ట్వీట్‌...

తాజాగా బండి భ‌గీర‌థ్ కేసుపై టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ రియాక్ట్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అధికారం, ప‌ద‌వి న్యాయానికి అడ్డుగా నిల‌వొద్దంటూ త‌న ట్వీట్‌లో మంచు మ‌నోజ్ పేర్కొన్నారు.
"పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రతి మైనర్ బాలికకు కచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే పోక్సో చట్టాన్ని తీసుకువచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను. అధికారం, పదవి, పలుకుబడి ఎప్పుడూ న్యాయానికి అడ్డు రాకూడదు. రాజ్యాంగం, చట్టం దృష్టిలో ప్ర‌తి ఒక్క‌రికి సమానమైన న్యాయం దక్కాల్సిందే. మైనర్లకు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించాలి. పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరం. విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా లేదా పక్షపాత చర్యలు తీసుకున్నా.. అది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది" అని మంచు మ‌నోజ్ అన్నారు.

ప‌క్ష‌పాతం లేకుండా...

"ఇది రాజకీయాలకు లేదా వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. కేవలం నిజం బయటకు రావాలి, న్యాయం గెలవాలి. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలకు తావులేకుండా ఈ కేసు దర్యాప్తు జ‌ర‌గాలి. చట్టపరమైన ప్రక్రియలన్నీ వేగంగా, ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధితుల‌కు న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు అందరికీ స్పష్టంగా కనిపించాలి. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితం కావాలి" అని మంచు మ‌నోజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. టాలీవుడ్ నుంచి పోక్సో కేసుపై రియాక్ట్ అయిన ఫ‌స్ట్ సెలిబ్రిటీగా మంచు మ‌నోజ్ నిలిచారు.

 

Advertisement
Advertisement