Malavika Mohanan | ఒంటరితనం మానసికంగా తీవ్ర ప్రభావం చూపించింది : మాలవిక మోహనన్
Malavika Mohanan | నటి మాలవిక మోహనన్ ఇటీవల తన ఒంటరితనంతో ఎదురైన అనుభవాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మార్చి నెల ఆమెకు మిశ్రమ అనుభూతులను ఇచ్చిందని, ముఖ్యంగా పాకెట్ నావల్ మూవీ షూటింగ్ ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది.
Entertainment | Published On Apr 3, 2026, 5.25 pm IST
Malavika Mohanan | నటి మాలవిక మోహనన్ ఇటీవల తన ఒంటరితనంతో ఎదురైన అనుభవాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మార్చి నెల ఆమెకు మిశ్రమ అనుభూతులను ఇచ్చిందని, ముఖ్యంగా పాకెట్ నావల్ మూవీ షూటింగ్ ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది. దర్శకుడు థియాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో పనిచేయడం ప్రత్యేకమైన సృజనాత్మక అనుభవం ఇచ్చిందని చెప్పింది. ఆయన పని విధానం గమనించడం, మార్గదర్శకత్వంలో నటిగా పని చేయడం తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడిందని వ్యాఖ్యానించింది. షూటింగ్ కారణంగా ఎక్కువ రోజులు చెన్నైలో గడిపిన మాలవిక, ఇంటికి దూరంగా ఉండటం తనపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పింది.
“రోజంతా షూటింగ్‌లో బిజీగా గడిపి, ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నానని అనిపించిన సందర్భంలో చాలా కష్టంగా ఉంది” అని వాపోయింది. కానీ, కుటుంబ సభ్యులు చెన్నైకు వచ్చి కలిసిన సమయంలో కొంత ఉపశమనం పొందినట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఇష్టమైన భోజనం ఆస్వాదించడం, కుటుంబంతో ఉండటం నాకు చాలా రిలాక్స్ అనిపించిందని చెప్పింది. కుటుంబీకులతో కలిసి చెన్నై, మహాబలిపురంలోని దేవాలయాలను సందర్శించానని.. ఇష్టమైన ఫుడ్‌ని తీసుకొని హాయిగా సమయాన్ని ఆస్వాదించానని తెలిపింది. ఇటీవల ముంబయికి తిరిగి వచ్చానని.. ఇంటికి దూరంగా ఉన్నాననే భావన నుంచి బయట పడేందుకు సాయంత్రం వేళల్లో పడవ ప్రయాణాలు చేసినట్లుగా మాలవిక చెప్పుకొచ్చింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



