Bhagyashri Borse | టాలెంటెడ్ బ్యూటీకి ‘లెనిన్’ టీమ్ స్పెషల్ బర్త్‌డే విషెస్..!
Bhagyashri Borse | యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా లెనిన్ సినిమా టీమ్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపింది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ “భారతి” పాత్రలో కనిపించనుంది. పౌరాణిక గెటప్‌లో ఉన్న ఆమె లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది.
Entertainment | Published On May 6, 2026, 12.57 pm IST
Bhagyashri Borse | యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అందంతో పాటు నటనతోనూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఆ తర్వాత తెలుగులో అవకాశాలను అందుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తుంది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కతున్న లెనిన్ చిత్రంలో లీడ్‌రోల్‌లో నటిస్తోంది. బుధవారం (మే 6)న భాగ్యశ్రీ బర్త్‌డే సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పౌరాణిక పాత్రలో ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. భాగ్యశ్రీ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
లెనిన్ మూవీలో అఖిల్ హీరోగా నటిస్తుండగా.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌రైటర్‌గా లెనిన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు టాక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. జూన్ 26న మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే వదిలిన సాంగ్స్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా భాగ్యశ్రీ బర్త్ డే సందర్భంగా టీ-సిరీస్ సంస్థ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. భారతి పాత్రలో భాగ్యశ్రీ తన ప్రతిభతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందంటూ పోస్టర్‌ను షేర్ చేసింది. ఇక భాగ్యశ్రీ సినిమాల విషయానికి.. చివరిసారిగా ఆంధ్రాకింగ్ తాలూక మూవీలో నటించింది. ఈ మూవీలో రామ్‌తో జతకట్టింది. ప్రస్తుతం లెనిన్‌లో అఖిల్‌తో రొమాన్స్ చేయనుంది. అలాగే, తమిళంలో సియోన్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో శివ కార్తీకేయన్‌కు జోడీగా కనిపించనుంది ఈ మరాఠా బ్యూటీ.
Team #LENIN wishes the radiant and supremely talented #BhagyashriBorse a very Happy Birthday 🔥🔥
Just like she always does, Bharathi too is coming to mesmerize and conquer everyone with her magic ❤️#LeninOnJune26th @AkhilAkkineni8 @iamnagarjuna @vamsi84 @KishoreAbburu… pic.twitter.com/qQkeye0PSZ
— Annapurna Studios (@AnnapurnaStdios) May 6, 2026
Bhagyashri Borse joins #SivaKarthikeyan’s October 2026 Release #Seyon!...🔥🔥🔥#BhagyashriBorse #SivaKarthikeyan #Seyon #HappyBirthdayBhagyashri #சேயோன் #OneMoreTime #KamalHaasan #Kollywood #Tollywood #entertainment #Bigtv #Bigtvcinema@ikamalhaasan @ikamalhaasanfan… pic.twitter.com/Ei7kaEGL2u
— BIG TV Cinema (@BigtvCinema) May 6, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



