త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Keerthy Suresh | అక్కినేని హీరో మైథ‌లాజిక‌ల్ మూవీ – గెస్ట్ రోల్‌లో కీర్తి సురేష్‌

రౌడీ జ‌నార్ధ‌న త‌ర్వాత తెలుగులో మ‌రో మూవీకి కీర్తి సురేష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అక్కినేని హీరో మైథలాజికల్ మూవీలో గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది. ఆ సినిమా ఏదంటే?

N

Entertainment | Published On Feb 10, 2026, 12.21 pm IST

Keerthy Suresh | అక్కినేని హీరో మైథ‌లాజిక‌ల్ మూవీ – గెస్ట్ రోల్‌లో కీర్తి సురేష్‌
Advertisement

Keerthy Suresh |  పెళ్లి కార‌ణంగా ఏడాదిపాటు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన కీర్తి సురేష్ మ‌ళ్లీ జోరు పెంచింది. ప్ర‌స్తుతం తెలుగులో రౌడీ జ‌నార్ధ‌నలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా క‌నిపించ‌బోతున్న‌ది. బాలీవుడ్‌, మ‌ల‌యాళంలో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

గెస్ట్ రోల్‌...

తాజాగా కీర్తి సురేష్ తెలుగులో ఓ మైథ‌లాజిక‌ల్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే హీరోయిన్‌గా కాదు. ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది. సుమంత్ హీరోగా మ‌హేంద్ర‌గిరి వారాహి పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. మ‌హేంద్ర‌గిరి వారిహి అమ్మ‌వారి గుడి నేప‌థ్యంలో సోషియో ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

25 కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు 25 కోట్ల తో సుమంత్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా మ‌హేంద్ర‌గిరి వారాహి రూపొందుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హేంద్ర‌గిరి వారాహి మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అమ్మ‌వారిగా కీర్తి సురేష్ న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ పాత్ర‌కు సంబంధించిన సీన్లు సినిమాకు హైలైట్‌గా ఉంటాయ‌ని అంటున్నారు. అలాగే సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ క్యారెక్ట‌ర్ చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంద‌ట‌. ఐదు నుంచి ఏడు నిమిషాల నిడివితో అత‌డి పాత్ర సాగుతుంద‌ట‌. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి పాత్ర‌ల‌కు సంబంధించిన సీన్ల‌ను షూట్ చేయ‌నున్నార‌ట‌. మ‌హేంద్ర‌గిరి వారాహి సినిమాలో మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్ర‌హ్మానందం, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సుబ్ర‌హ్మ‌ణ్యంపురం త‌ర్వాత‌...

మ‌హేంద్ర‌గిరి వారాహి మూవీకి అనూర్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. సుమంత్‌, సంతోష్ జాగ‌ర్ల‌పూడి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం అనే సినిమా చేశారు. మ‌హేంద్ర‌గిరి వారాహి షూటింగ్ మొద‌లై రెండేళ్లు దాటిపోయింది. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ ప‌నుల వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
మ‌హేంద్ర‌గారి వారిహితో పాటు తెలుగులో నూట‌న్స్ థ‌ర్డ్ లా పేరుతో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తున్నాడు సుమంత్‌. మే 15న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Advertisement
Advertisement