త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rukmini Vasanth | నేష‌న‌ల్ క్ర‌ష్ బాట‌లోనే కాంతారా బ్యూటీ రుక్మిణి..!

Rukmini Vasanth | శాండ‌ల్‌వుడ్ బ్యూటీలు టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే ఎంద‌రో బ్యూటీలు టాలీవుడ్‌లో అగ్ర‌ హీరోయిన్లుగా ఎదిగారు. కన్నడ సినిమాలకన్నా ఎక్కువగా తెలుగులో నటిస్తూ పాన్ ఇండియా స్థాయి వ‌ర‌కు ఎదిగారు.

P

Entertainment | Published On Feb 11, 2026, 1.48 pm IST

Rukmini Vasanth | నేష‌న‌ల్ క్ర‌ష్ బాట‌లోనే కాంతారా బ్యూటీ రుక్మిణి..!
Advertisement

Rukmini Vasanth | శాండ‌ల్‌వుడ్ బ్యూటీలు టాలీవుడ్‌లో స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే ఎంద‌రో బ్యూటీలు టాలీవుడ్‌లో అగ్ర‌హీరోయిన్లుగా ఎదిగారు. కన్నడ సినిమాలకన్నా ఎక్కువగా తెలుగులో నటిస్తూ పాన్ ఇండియా స్థాయి వ‌ర‌కు ఎదిగారు. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌త్యేకం. ర‌ష్మిక టాలీవుడ్‌కు హ‌లో మూవీతో ప‌రిచ‌యమైంది. ఆ త‌ర్వాత గీతాగోవిందం, స‌రిలేరునీకెవ్వ‌రూ త‌దిత‌ర సినిమాల్లో అవ‌కాశం ద‌క్కించుకొని అగ్ర‌హీరోయిన్ వ‌రకు ఎదిగింది. పుష్ప మూవీతో పాన్ ఇండియా స్థాయిలో స‌త్తాచాటింది. బాలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ త‌న హ‌వా కొన‌సాగిస్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ ర‌ష్మిక‌పై క‌న్న‌డిగులు తెలుగులో ఎక్కువగా న‌టిస్తున్నందుకు విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటుంది. తాజాగా నేష‌న‌ల్ క్ర‌ష్ బాట‌లోనే రుక్మిణి వ‌సంత్ సైతం వెళ్తోంది. తెలుగులో రిలీజ్ అయిన ‘సప్త సాగరాలు దాటి’ మూవీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఆ త‌ర్వాత అపుడో ఇపుడో ఎపుడో మూవీలో న‌టించింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో ఛాన్స్ ద‌క్కించుకుంది. అలాగే, రామ్ చ‌ర‌ణ్ మూవీలోని అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని వార్త‌లున్నాయి. రుక్మిణి ‘కాంతార చాప్టర్ 1’తో కన్నడలో స్టార్ హోదా కూడా సొంతం చేసుకుంది. తెలుగులో ఆమెకు పెరుగుతున్న డిమాండ్ చూస్తే.. రుక్మిణి త్వరలో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదగబోతోందనే అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌లో రాణిస్తేనే.. బాలీవుడ్ అవ‌కాశాలు వ‌చ్చే ఛాన్స్ ఎక్కువ‌గా ఉన్న‌ది. ప్ర‌స్తుతం రుక్మిణి సైతం ఎక్కువ డేట్స్ తెలుగు సినిమాల‌కు ప్రాధాన్యం ఇస్తుంద‌ని స‌మాచారం. ఈ క్రమంలో కన్నడ సినిమాలను పక్కన పెడితే.. రష్మిక లాగే క‌న్న‌డ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుక్మిణి కూడా రష్మికలా తెలుగులోనే ఎక్కువ ఫోకస్ పెట్టుతుందా? కన్నడ సినిమాల్లోనూ స‌మానంగా న‌టిస్తుందా? అనే ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement