త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jyothi Rai | పెళ్ల‌య్యాక వెకేష‌న్‌కు వ‌ద్దు… సినిమా చేద్దామ‌న్నారు – భ‌ర్త‌పై గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి కామెంట్స్‌

గుప్పెడంత మ‌న‌సు త‌ర్వాత సీరియ‌ల్స్‌కు గుడ్‌బై చెప్పిన జ్యోతిరాయ్‌...కిల్ల‌ర్ పేరుతో ఓ మూవీ చేసింది. సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి జ్యోతిరాయ్ భ‌ర్త సుకు పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. పెళ్ల‌య్యాక తాము చేసిన మొద‌టి మూవీ ఇద‌ని టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో జ్యోతిరాయ్ అన్న‌ది.

N

Entertainment | Published On Feb 23, 2026, 5.27 pm IST

Jyothi Rai | పెళ్ల‌య్యాక వెకేష‌న్‌కు వ‌ద్దు… సినిమా చేద్దామ‌న్నారు – భ‌ర్త‌పై గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి కామెంట్స్‌
Advertisement

Jyothi Rai |  గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది జ్యోతిరాయ్‌, స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్‌లో జ‌గ‌తి పాత్ర‌లో క‌నిపించింది. కొడుకు ప్రేమ కోసం ఆరాట‌ప‌డే త‌ల్లిగా ఎమోష‌న‌ల్ రోల్‌లో త‌న యాక్టింగ్‌తో బుల్లితెర ఫ్యాన్స్‌ను మెప్పించింది. గుప్పెడంత మ‌న‌సు త‌ర్వాత సీరియ‌ల్స్‌కు గుడ్‌బై చెప్పిన జ్యోతిరాయ్ సినిమాల‌పై ఫోక‌స్ పెడుతోంది.
ప్ర‌స్తుతం కిల్ల‌ర్ పేరుతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోంది జ్యోతిరాయ్‌. ఈ సినిమాకు ఆమె భ‌ర్త సుకుపూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో అత‌డే హీరోగా న‌టిస్తున్నాడు. కిల్ల‌ర్ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా జ‌ర్నీపై జ్యోతిరాయ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

రొటీన్ క్యారెక్ట‌ర్స్‌...

సీరియల్స్ లో రొటీన్ క్యారెక్టర్స్ చేసి విసిగిపోయి ఉన్న టైమ్ లో డైరెక్టర్ సుకు పూర్వజ్ నన్ను స్క్రీన్ మీద కొత్తగా చూపించేందుకు ముందుకొచ్చారు. కిల్ల‌ర్‌లో డిఫ‌రెంట్ షేడ్స్‌లో కూడిన క్యారెక్టర్‌లో క‌నిపిస్తా. ఇలాంటి మూవీ చేస్తానని క‌ల‌లో కూడా అనుకోలేదు. ఎవరైనా డ్యూయల్ రోల్ చేస్తారు కానీ ఆరేడు క్యారెక్టర్స్ క‌నిపించే అవ‌కాశం రావ‌డం యాక్టర్ కైనా డ్రీమ్. విజయశాంతి గారిలా యాక్షన్ సినిమా చేయాల‌న్న‌ది నా క‌ల‌. ఆ కోరిక కిల్ల‌ర్ సినిమాతో తీరింది.

వెకేష‌న్ అనుకుంటే...

పెళ్లయ్యాక చాలా మంది వెకేషన్ కు వెళ్లాల‌ని ప్లాన్స్ వేస్తారు. కానీ మ‌నం క‌లిసి సినిమా చేద్దామని పూర్వాజ్ నాతో అన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. సినిమా రూపొందించడం ద్వారా కొంత మందికైనా ఉపాధి కల్పిస్తామ‌ని అనిపించింది. . జ్యోతి అంటే మంచి న‌టి అని, పూర్వాజ్ అంటే టాలెంటెడ్ డైరెక్టర్ అని కిల్ల‌ర్‌తో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. మాకున్న లిమిటేషన్స్ దాటి ఈ సినిమాను రూపొందించాం అని జ్యోతిరాయ్ అన్న‌ది.
సుకు పూర్వ‌జ్‌తో పెళ్లి త‌ర్వాత త‌న పేరును జ్యోతి పూర్వ‌జ్‌గా మార్చుకుంది జ్యోతిరాయ్‌.

గుప్పెడంత మ‌న‌సు కంటే ముందు తెలుగులో క‌న్యాదానంతో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేసింది. క‌న్న‌డంలో ప‌దికిపైగా సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం నో మోర్ సీక్రెట్స్ పేరుతో హిందీలో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేస్తోంది జ్యోతిరాయ్‌.

 

 

Advertisement
Advertisement