NTR | వామ్మో.. జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా…
డ్రాగన్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఆదివారం జోర్డాన్ వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వాచ్ ధర ఎంతంటే?
Entertainment | Published On Feb 8, 2026, 5.36 pm IST
NTR | సెలిబ్రిటీలే వాడే గాడ్జెస్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. డ్రెస్‌ల నుంచి వారు వాడే వాచెస్, గాగూల్స్...ఇలా ప్రతీదీ ఏ బ్రాండ్. రేట్ ఎంత అనే డిస్కషన్స్ సోషల్ మీడియాలో జోరుగానే జరుగుతుంటాయి. తాజాగా ఎన్టీఆర్ ధరించిన ఓ వాచ్ ధర విని అభిమానులు షాకవుతున్నారు.
ప్రశాంత్ నీల్ డ్రాగన్...
ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జోర్డాన్‌లో మొదలుకాబోతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఆదివారం జోర్డాన్ బయలుదేరారు.ఎన్టీఆర్ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఈ ఫొటోల్లో గడ్డంతో బ్రౌన్ కలర్ టీషర్ట్ , బ్లాక్ కలర్ గాగూల్స్‌తో ఎన్టీఆర్ కనిపించారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రోలెక్స్ డేటోనా 2025 మోడల్ వాచ్ ధరించి ఎన్టీఆర్ కనిపించారు. ఈ వాచ్ ధర రెండో కోట్ల ఇరవై ఆరు లక్షలకుపైనే ఉంటుందట.
సినిమా తీయచ్చు...వాచ్ ధర విని నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎన్టీఆర్ వాచ్ కోసం పెట్టిన ధరతో ఓ చిన్న సినిమా తీయచ్చని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఎన్టీఆర్ వాచ్‌తో లైఫ్ సెటిలైపోతుందని అంటున్నారు.
ఏడున్నర కోట్లు...
ఎన్టీఆర్‌కు వాచ్‌లు అంటే పిచ్చి. అతడి దగ్గర రోలెక్స్ డేటోనాతో పాటు పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు చెందిన వాచ్‌లు ఉన్నాయి. రిచర్డ్ మిల్లే మెక్ లారెన్ ఎడిషన్ వాచ్ కూడా ఎన్టీఆర్ వద్ద ఉంది. ఈ వాచ్ ధర ఏడున్నర కోట్లకుపైనే ఉంటుంది. నాలుగున్నర కోట్లతో రిచర్డ్ మిల్లే ఫ్లైబ్యాక్ మోడల్ వాచ్‌ను కొనుగోలు చేశారు.
ఇవే కాకుండాపటేక్ ఫిలిప్, వాచెరోన్ కాన్‌స్టంటిన్, రోలెక్స్‌తో పాటు పలు ఖరీదైన వాచ్‌లు ఉన్నాయి. వీటి ధర కోటి నుంచి మూడు కోట్ల మధ్య ఉంటుంది.
డ్రాగన్ మూవీ లో ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాన్ ఇండియన్ మూవీని జూన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ షూటింగ్ డిలే వల్ల రిలీజ్ వాయిదాపడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. డ్రాగన్‌లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటులు టోవినో థామస్, బీజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. డ్రాగన్ తర్వాత దేవర 2 మూవీ చేయబోతున్నారు ఎన్టీఆర్.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



