త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Faria Abdullah | మెగాఫోన్ పట్టనున్న జాతిర‌త్నాలు హీరోయిన్‌…

జాతిర‌త్నాలు హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా త‌న‌లోని కొత్త టాలెంట్‌ను బ‌య‌ట‌పెట్ట‌బోతుంది. ద‌ర్శ‌కురాలిగా మార‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా నెక్స్ట్ ఇయ‌ర్ మొద‌లుకాబోతున్న‌ట్లు చెప్పింది.

N

Entertainment | Published On Apr 27, 2026, 9.15 pm IST

Faria Abdullah |  మెగాఫోన్ పట్టనున్న జాతిర‌త్నాలు హీరోయిన్‌…
Advertisement

Faria Abdullah |  టాలీవుడ్ హీరోయిన్లు కేవ‌లం యాక్టింగ్‌కు ప‌రిమితం కావ‌డం లేదు. ప్రొడ్యూస‌ర్లుగా, రైట‌ర్లుగా స‌త్తా చాటుతోన్నారు. జాతిర‌త్నాలు హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా కూడా త‌న‌లోని కొత్త టాలెంట్‌ను బ‌య‌ట‌పెట్ట‌బోతుంది. మెగాఫోన్ ప‌ట్ట‌బోతుంది. ఈ విష‌యాన్ని గాయ‌ప‌డ్డ సింహం ప్ర‌మోష‌న్స్‌లో ఫ‌రియా అబ్దుల్లా బ‌య‌ట‌పెట్టింది.
త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ మే 1న రిలీజ్ కాబోతుంది. జేడీ చ‌క్ర‌వ‌ర్తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ సినిమాలో శ్రీవిష్ణు ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. గాయ‌ప‌డ్డ సింహంతో పాటు త‌న కెరీర్ గురించి ఫ‌రియా అబ్దుల్లా చెప్పిన విశేషాలివి...

కామెడీ ఎలిమెంట్‌తో...

గాయ‌ప‌డ్డ సింహంలో శాలిని అనే రోల్ చేస్తున్నా. తను ఓ వ్లాగర్. ఇందులో త‌రుణ్ భాస్క‌ర్‌తో నాకు రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. మా ల‌వ్‌స్టోరీని డైరెక్టర్ కశ్యప్ చాలా డిఫరెంట్‌గా రాశారు. మల్టీపుల్ లేయర్స్‌లో జరిగే కథ ఇది. నా పాత్ర కామెడీ ఎలిమెంట్‌తో ఫ‌న్నీగా సాగుతుంది. గాయ‌ప‌డ్డ సింహంలో నాతో పాటు మాన‌స చౌద‌రి మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. మాన‌స చౌద‌రి హీరోకు హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిగా క‌నిపిస్తే నేను అత‌డి చేయిని పట్టుకున్న న‌డిపించే యువ‌తిగా క‌నిపిస్తా. (నవ్వుతూ).

డైరెక్ట‌ర్లు...

తరుణ్ భాస్కర్ చాలా సరదాగా ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. త‌రుణ్‌తో కాంబినేష‌న్‌లో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశా. శ్రీ విష్ణు క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. త‌న పాత్ర‌ను డిజైన్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది.తరుణ్, జేడీ చ‌క్ర‌వ‌ర్తి, పవన్… ఇలా గాయ‌ప‌డ్డ సింహంలో చాలా మంది దర్శకులు ఉన్నారు. వారితో కలిసి పని చేయడం మంచి అనుభవాన్ని అందించింది. సెట్స్‌లో సత్య నుంచి పెళ్లి చూపులు వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం.

మెగా ఫోన్‌...

కథ విన్నప్పుడే న‌చ్చేయాలి. నా క్యారెక్ట‌ర్ కూడా చాలా క్రేజీగా ఉండాలి. కొత్త‌ద‌నం క‌నిపించాలి. అలాంటి సినిమాలే ఎంచుకుంటున్నా. ద‌ర్శ‌కురాలిగా మారే ప్ర‌య‌త్నాల్లో ఉన్నా. నెక్స్ట్ ఇయ‌ర్ మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నా. నా సినిమా కోసం కొన్ని క‌థ‌లు రాసుకుంటున్నా.

నాలుగు సినిమాలు...

గాయ‌ప‌డ్డ సింహంతో పాటు మ‌రో నాలుగు సినిమాలు చేస్తోన్నాడు. నేను హీరోయిన్‌గా న‌టించిన భగవంతుడు మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో రిలీజ్ కాబోతుంది. సందీప్ కిష‌న్ తో ‘సిగ్మా’ చేస్తున్నాను. సత్యదేవ్ తో ఓ సినిమా అంగీక‌రించా. మ‌రో రెండు సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

 

Advertisement
Advertisement