Janhvi Kapoor | ఎమ్మెల్యే కూతురిగా జాన్వీ కపూర్ – పెద్ది ట్రైలర్ రిలీజ్‌పై అప్‌డేట్…
పెద్ది మూవీలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. జాన్వీ పాత్రకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ను డీవోపీ రత్నవేలు బయటపెట్టారు. అదేమిటంటే?
Entertainment | Published On May 11, 2026, 7.11 pm IST
Janhvi Kapoor | రామ్‌చరణ్ పెద్దిలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ దేవర తర్వాత శ్రీదేవి తనయ నటిస్తోన్న సెకండ్ తెలుగు మూవీ ఇది. జాన్వీకపూర్ బర్త్‌డే సందర్భంగా ఇటీవలే మార్చిలో ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. పెద్దిలో అచ్చియమ్మగా ఈ బ్యూటీ కనిపించబోతున్నట్లు ప్రకటించారు. జాన్వీ రోల్ డేరింగ్ అండ్ డాషింగ్‌గా సాగుతుందని వెల్లడించారు. ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో జాన్వీ బహిరంగ సభలో మాట్లాడుతుండటం, ప్రచారం చేస్తున్నట్లుగా కనిపించడంతో ఆమె క్యారెక్టర్‌కు పొలిటికల్ టచ్ ఉంటుందని గుసగుసలు వినిపించాయి. కానీ మేకర్స్ మాత్రం ఈ రూమర్లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జాన్వీ రోల్ విషయంలో సీక్రెట్ మెయింటేన్ చేస్తూ వచ్చారు.
రావు రమేష్...
తాజాగా పెద్ది ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటపెట్టారు. ఇందులో ఎమ్మెల్యే కూతురిగా ఈ ముద్దుగుమ్మ కనిపించనుందట. ఎమ్మెల్యే పాత్రను రావురమేష్ చేయబోతున్నారట. చాలా అగ్రెసివ్‌గా జాన్వీ పాత్ర సాగుతుందని డీవోపీ రత్నవేలు అన్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పెద్దిలో యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోతాయని, నైట్ ఎఫెక్ట్ ఫైట్‌తో పాటు రైల్వే యార్డ్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని రత్నవేలు చెప్పారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ హై ఎమోషన్స్‌తో సాగుతాయని, సినిమాలో రెండు క్రికెట్ మ్యాచ్‌లు ఉంటాయని, ఆ సీన్లు ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉంటాయని పేర్కొన్నారు.
ట్రైలర్ ఎప్పుడంటే?
పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. మే 18న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఓ స్పెషల్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ భోపాల్‌లో జరుగనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు రామ్‌చరణ్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్‌తో పాటు మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ హాజరుకానున్నారట.
పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జూన్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



