Janhvi Kapoor | ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లా.. జనం నన్ను ద్వేషిస్తున్నారనిపించింది : జాన్వీ కపూర్
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ సినీరంగ ప్రవేశం చేసింది. ధడక్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా తర్వాత ఎదుర్కొన్న మానసిక పరిస్థితిపై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Entertainment | Published On Apr 8, 2026, 12.30 pm IST
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ సినీరంగ ప్రవేశం చేసింది. ధడక్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా తర్వాత ఎదుర్కొన్న మానసిక పరిస్థితిపై జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తల్లి శ్రీదేవి మరణం తర్వాత కొద్ది నెలలకే విడుదలైన ఈ మూవీ కొన్ని మధురమైన, మరికొన్ని విషాధకరమైన అనుభావాలను మిగిల్చిందని పేర్కొంది. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జాన్వీ.. కెరీర్ తొలిరోజులను గుర్తు చేసుకుంది. 2018లో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ధడక్‌లో నటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఎవరైనా ధడక్ గురించి మాట్లాడితే చాలా బాగా చేశావని, మూవీ హిట్ అయ్యిందని చెబుతారని తెలిపింది. కానీ, తనకు అది భిన్నంగా అనిపించిందని, మూవీ రిలీజ్ తర్వాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని.. ఇక తన కెరీర్ ముగిసిపోయిందని, జనం ద్వేషిస్తున్నారని భావించానని తెలిపింది. తన జీవితంలో వచ్చిన గుర్తింపు ఎక్కువగా తల్లి నుంచే వచ్చేదని, ఆమె ఇక లేదని.. అదే అభిమానాన్ని ప్రేక్షకుల నుంచి ఆశించానని జాన్వీ చెప్పుకొచ్చింది. అందరూ తనను సమానంగా అంగీకరిస్తారని అనుకున్నానని.. కానీ, అది సాధ్యం కాదని అర్థం కాలేదని.. తాను నెగెటివ్ కామెంట్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టానని.. మూవీ సక్సెస్ ఆ సమయంలో గుర్తుకురాలేదని తెలిపింది.
ధడక్, గుంజన్ సక్సేనా మూవీల సమయంలో తనకు అర్హత లేకపోయినా అవకాశాలు వచ్చాయని భావించారని.. దాంతో తనలో నిస్పృహ ఆవహించిందని, నటనపై తనకు ఉన్న ప్రేమే తనను ముందుకు నడిపించిందని తెలిపింది. దర్శకుడు శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ధడక్ మూవీని కరణ్ జోహార్ నిర్మించారు. 2016లో వచ్చిన మరాఠీ చిత్రం సైరత్‌కి రీమేక్‌గా తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద రూ.110కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత జాన్వీ ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘రూహీ’, ‘గుడ్ లక్ జెర్రీ’ వంటి విభిన్న చిత్రాల్లో నటించారు. చివరిసారిగా ‘సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి’ చిత్రంలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్ది మూవీలో నటిస్తుంది. ఈ మూవీ ఈ ఏడాది విడుదలకానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



