Janhvi Kapoor | ఇక తెలుగు సినిమాలపైనే ఆశలు.. జాన్వీ కపూర్ ప్లాన్ ఏంటి..?
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. 2018లో విడుదలైన ధడక్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత గుంజన్ సక్సేనా, రూహీ, మిలీ వంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రశంసలు అందుకుంది. గుంజన్ సక్సేనాలో పైలట్‌గా కనిపించింది. ఆ తర్వాత రూహీ, గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాల్లో భిన్నమైన పాత్రలు చేసింది.
Entertainment | Published On May 6, 2026, 6.03 pm IST
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. 2018లో విడుదలైన ధడక్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత గుంజన్ సక్సేనా, రూహీ, మిలీ వంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రశంసలు అందుకుంది. గుంజన్ సక్సేనాలో పైలట్‌గా కనిపించింది. ఆ తర్వాత రూహీ, గుడ్ లక్ జెర్రీ, మిలీ సినిమాల్లో భిన్నమైన పాత్రలు చేసింది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డా ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దాంతో ప్రస్తుతం కెరీర్ కొంచెం స్లో అయినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల హిందీలో ‘సన్నీ కా సంస్కారి తులసీ కుమారి’లో నటించినా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో కొత్త అవకాశాలు తగ్గినట్లుగా టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా దర్శక నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు మరింత తగ్గాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేనథ్యంలో జాన్వీ దక్షిణాదిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దేవర మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. వరుస అవకాశాలు దక్కించుకొని కెరీర్‌ను చక్కదిద్దుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీపైనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెద్ది తర్వాత ఏం సినిమా చేస్తుందన్న దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.
దేవర-2 ప్రాజెక్టు ఇప్పట్లో ముందుకు సాగాలే కనిపించడం లేదు. దాంతో ఏ ప్రాజెక్టులో నటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రాబోయే ‘రాకా’ సినిమాలో జాన్వీ సైతం కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ, ఇప్పటి వరకు అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం జాన్వీ చేతిలో పెద్ద ప్రాజెక్టులు లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో జాన్వీ కపూర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. మళ్లీ బాలీవుడ్‌కు వెళ్తుందా? టాలీవుడ్‌లో స్థిరపడేందుకే ఆసక్తి చూపుతుందా? వేచి చూడాల్సిందే. పెద్ది సినిమా ఫలితంపైనే జాన్వీ కెరీర్‌ను నిర్ణయించనుంది. రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ జూన్ 4న విడుదల కానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



