త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ibomma Ravi | ఐ బొమ్మ ర‌వికి బెయిల్‌…ఇంట‌ర్నెట్ వాడొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

ఐ బొమ్మ ర‌వికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. క‌ఠిన‌మైన ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఎట్టి ప‌రిస్థితుల్లో దేశం దాటి వెళ్ల‌కూడ‌ద‌ని కండీష‌న్ పెట్టింది.

N

Entertainment | Published On Feb 17, 2026, 6.13 pm IST

Ibomma Ravi | ఐ బొమ్మ ర‌వికి బెయిల్‌…ఇంట‌ర్నెట్ వాడొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
Advertisement

Ibomma Ravi |ఐ బొమ్మ ర‌వికి బెయిల్ మంజూరు అయ్యింది. మంగ‌ళ‌వారం తెలంగాణ హైకోర్టు ర‌వికి ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. ఎట్టి ప‌రిస్థితుల్లో దేశం విడిచి వెళ్లిపోకూడ‌ద‌ని రవిని ఆదేశించింది. పాస్‌పోర్ట్ స‌రెండ‌ర్ చేయ‌డంతో పాటు ప్ర‌తిరోజు ఉద‌యం సీసీఎస్ పోలీసుల ఎదుట హాజ‌రుకావాల‌ని కోర్టు తెలిపింది. పైర‌సీ కేసు విచార‌ణ కొన‌సాగుతున్నంత కాలం ఐబొమ్మ ర‌వి ఇంట‌ర్నెట్ వాడ‌కూడ‌ద‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక‌వేళ ఇంట‌ర్నెట్ వాడాలంటే పోలీసులు అనుమ‌తి తీసుకోవాల‌ని కోర్టు చెప్పింది. మ‌ళ్లీ అత‌డు పైర‌సీకి పాల్ప‌డుకుండా ఉండ‌టానికే ఇంట‌ర్నెట్ విన‌యోగంపై కోర్టు ఆంక్ష‌లు విధించిన‌ట్లు చెబుతున్నారు.

న‌వంబ‌ర్‌లో అరెస్ట్‌...

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఐ బొమ్మ ర‌విని పైర‌సీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి ఇండియాకు వ‌చ్చిన అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. ఐ బొమ్మ పేరుతో వెబ్‌సైట్‌ను స్టార్ట్ చేసిన ర‌వి కొత్త సినిమాలు విడుద‌లైన వెంట‌నే పైర‌సీ చేస్తూ వాటిని సైట్‌ల‌లో అప్‌లోడ్ చేసి ఇండ‌స్ట్రీకి కోట్ల రూపాయ‌లలో న‌ష్టం క‌లిగించారు. ఐ బొమ్మ ర‌వి వ‌ల్ల సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇప్ప‌టివ‌ర‌కు 3700 కోట్ల‌కుపైగా న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం.

భార్య‌నే అరెస్ట్ చేయించిందా?

జైలు నుంచి విడుద‌లైన ర‌వి ఎక్క‌డికి వెళ‌తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌వి అరెస్ట్‌ను తండ్రి కూడా స‌మ‌ర్థించారు. త‌ప్పు చేశాడు కాబ‌ట్టే అరెస్ట్ అయ్యాడు అంటూ కామెంట్స్ పెట్టాడు. మ‌రోవైపు భార్య నుంచి అత‌డు విడిపోయిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌వితో ఉన్న గొడ‌వ‌ల కార‌ణంగానే అత‌డిని భార్య‌నే అరెస్ట్ చేయించిందంటూ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. కోర్టు ఆదేశాల వ‌ల్ల విదేశాల‌కు వెళ్లే అవ‌కాశం లేక‌పోడంతో అత‌డు ఏం చేయ‌బోతున్నాడు? ఎక్క‌డ ఉంటాడ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

విదేశాల నుంచే...

పైర‌సీ కేసులో ర‌విని అరెస్ట్ చేసిన పోలీసులు అత‌డి నుంచి ప‌లు కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టారు. విదేశాల్లోనే ఉంటూ అత‌డు ఈ పైర‌సీ నెట్‌వ‌ర్క్‌ను న‌డిపిస్తూ వంద‌ల కోట్ల‌లో ఆదాయాన్ని ఆర్జించిన‌ట్లు వెల్ల‌డైంది. మారుపేర్ల‌తో ర‌వి ఆధార్‌, ఓట‌ర్ ఐడీ కార్డుల‌ను తీసుకున్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది.

Advertisement
Advertisement