Mahavatar Parshuraam | మహావతార్ నరసింహాకు సీక్వెల్ – పరశురాముడి కథతో యానిమేషన్ మూవీ
మహావతార్ నరసింహా మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను ఆదివారం మేకర్స్ రిలీజ్ చేశారు. మహా అవతార్ పరశురామ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ యానిమేషన్ మూవీ 2027 డిసెంబర్‌లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు.
Entertainment | Published On Apr 19, 2026, 3.43 pm IST
Mahavatar Parshuraam | గత ఏడాది రిలీజైన మహావతార్ నరసింహా ఇండియన్ యానిమేషన్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. నలభై కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా 325 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇండియన్ యానిమేషన్ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
మహా అవతార్ పరశురామ్...
తాజాగా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో సినిమా రాబోతుంది. మహావతార్ నరసింహాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను ఆదివారం మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు మహా అవతార్ పరశురామ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడి కథతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. క్షత్రియ రాజుల అధర్మ పాలనను పరశురాముడి గండ్రగొడ్డలితో ఎలా అంతం చేశాడనే కథతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. క్షత్రియరాజుల రక్తంతో భూమిని 21 సార్లు పరశురాముడు ఎందుకు తడిపాడు? పరశురాముడికి ఆ గండ్రగొడ్డలిని శివుడు ఎందుకు ఇచ్చాడనే పౌరాణిక అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడు. ఆయన రూలర్ కాదు...అధర్మాన్ని వ్యతిరేకించే శక్తి అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.
2027 డిసెంబర్‌లో...
ఆదివారం రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో బీజీఎమ్, విజువల్స్, యామినేషన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టెక్నికల్‌గా టాప్‌నాచ్‌లో ఈ సినిమా ఉండటం ఖాయమని ఫ్యాన్స్ చెబుతోన్నారు. 2027 డిసెంబర్‌లో మహా అవతార్ పరశురామ్ సినిమాకు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ యానిమేషన్ మూవీని సలార్, కేజీఎఫ్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించబోతున్నది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు




