త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashu Reddy | అషురెడ్డి పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా.. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసుల‌కు ఆదేశం

Ashu Reddy | హనీ ట్రాప్‌, చీటింగ్ కేసులో అషు రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

P

Entertainment | Published On Apr 29, 2026, 12.01 pm IST

Ashu Reddy | అషురెడ్డి పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా.. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసుల‌కు ఆదేశం
Advertisement

Ashu Reddy | హ‌నీ ట్రాప్‌, చీటింగ్ కేసులో పోలీసులు న‌మోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ అషురెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను తెలంగాణ హైకోర్టు విచార‌ణు వాయిదా వేసింది. పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాంటూ కేసును క్వాష్ చేయాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేసింది. సోమ‌వారానికి విచార‌ణ వాయిదా వేసిన కోర్టు.. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. కేసు వివ‌రాల్లోకి వెళితే.. లండన్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర (వెంకట్)ను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, సంవత్సరాలుగా భారీగా డబ్బు, బంగారం, ఆస్తులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. మొత్తం రూ.9 కోట్లకుపైగా నగదు, ఐదు కిలోల బంగారం, లగ్జరీ కార్లు, ఫ్లాట్లు త‌న పేరిట రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను అషురెడ్డి ఖండించింది. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, వాస్తవాలను వక్రీకరించి కేసు పెట్టార‌ని ఆరోపించింది. పోలీసులు తన వాదనలు తెలుసుకోకుండానే, ఏకపక్షంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారంటూ హైకోర్టును ఆశ్ర‌యించింది. తన ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ పిటిష‌న్‌లో పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా.. అషురెడ్డి మాట్లాడిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. అందులో ధ‌ర్మేంద్ర‌కు కొంత మొత్తం తిరిగి చెల్లిస్తానని, మిగతా డబ్బు తర్వాత ఇస్తానని అషు రెడ్డి చెప్పినట్లు ఆడియోలో చెప్పింది. కేసులోకి కుటుంబ సభ్యులను లాగితే కేసులు పెడుతార‌ని హెచ్చ‌రించిన‌ట్లుగా ఆడియోలో వినిపించింది. ఇదే ఆడియోలో వేణుస్వామితో పాటు ప‌లువురి పేర్లు వెలుగులోకి రావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఆడియోలో ఎంత వ‌ర‌కు నిజం ఉన్న‌ది తెలియ‌రాలేదు. పోలీసులు ధ్రువీక‌రించాల్సి ఉంది. ఆడియో వివాదం వెలుగులోకి రావడం ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మార్చాయి. ప్ర‌స్తుతం కేసును అన్నికోణాల్లో విచారిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

Advertisement
Advertisement