Gaddar Awards | మార్చి 19న గద్దర్ అవార్డుల ప్రదానం – జ్యూరీ ఛైర్మన్‌గా మణిశర్మ
ఈ ఏడాది గద్దర్ ఫిల్మ్ అవార్డులను పది కేటగిరీలలో ఇవ్వబోతున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఏం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉగాది సందర్భంగా మార్చి 19న అవార్డులను ప్రదానం చేయబోతున్నట్లు వెల్లడించారు.
Entertainment | Published On Feb 6, 2026, 5.38 pm IST
Gaddar Awards | ఉగాది సందర్భంగా మార్చి 19న గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా 2025 ఏడాది గద్దర్ ఫిల్మ్స్ అవార్డులకు సంబంధించి జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు.
కమిటీకి ఛైర్మన్‌గా..
ఇందులో ప్రత్యేక అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా లెజెండరీ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు వ్యవహరిస్తుండగా...ఫీచర్ ఫిల్మ్స్ అవార్డ్ కమిటీకి ఛైర్మన్‌గా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఎంపికయ్యారు. గద్దర్ ఫిల్మ్స్ అవార్డ్స్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు ఏ అవసరం వచ్చినా సాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. సినీ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న దిల్‌రాజు సలహాలు, సూచనలు ఇస్తూనే ఉన్నారు, గద్దర్ అవార్డుల వేడుకను దిల్‌రాజు బాధ్యతయుతంగా తీసుకున్నారని భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సారి అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
పది కేటగిరీలలో...
ఈ ఏడాది గద్దర్ ఫిల్మ్ అవార్డులను పది కేటగిరీల్లో ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు ఆ కేటగిరీల వివరాలను వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డుతో పాటు టీఎన్ కాంతారావు అవార్డులను ఈ ఏడాది ప్రదానం చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ సారి కొత్తగా సి నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు అవార్డులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం నుంచి సినిమాల స్క్రీనింగ్ మొదలైంది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో సెన్సార్ సర్టిఫికెట్ పొందిన సినిమాలకు ఎంట్రీలుగా స్వీకరించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



