త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu Ai Movie | తెలుగులో తొలి ఏఐ మూవీ – మ‌హాభారతం ఆధారంగా…

ఏఐ ఆధారంగా తెలుగులో ఫ‌స్ట్ టైమ్ ఓ ఫుల్ మూవీ తెర‌కెక్కింది. “అంబ’s రివేంజ్‌” పేరుతో మైథ‌లాజిక‌ల్ రివేంజ్ డ్రామాగా మేక‌ర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మ‌హాభార‌తంలోని అంబ పాత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

N

Entertainment | Published On Apr 2, 2026, 2.22 pm IST

Telugu Ai Movie | తెలుగులో తొలి ఏఐ మూవీ – మ‌హాభారతం ఆధారంగా…
Advertisement

Telugu Ai Movie |  ఏఐ (ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) రాక‌తో సినిమా రంగంలోకి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. స్టోరీ బోర్డ్ నుంచి ప్ర‌మోష‌న్స్ వ‌ర‌కు ఏఐని ర‌క‌ర‌కాలుగా మేక‌ర్స్ వాడుకుంటున్నారు. ఇదివ‌ర‌కు గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ కోసం మేక‌ర్స్ కోట్ల‌లో ఖ‌ర్చుచేసేవారు. హాలీవుడ్ స్టూడియోల‌పై ఆధార‌ప‌డేవారు. కానీ ఏఐ రాక‌తో ఆ ఖ‌ర్చు చాలా త‌గ్గింది. డీ ఏజింగ్‌, డ‌బ్బింగ్ వంటి సాంకేతిక అంశాల విష‌యంలో ఏఐ మేక‌ర్స్‌కు ఉప‌యోగ‌ప‌డుతోంది. మ‌రికొంద‌రు ఫిల్మ్ మేక‌ర్స్ ఓ అడుగు ముందుకు వేసి ఏకంగా ఏఐతో ఫుల్ సినిమానే తెర‌కెక్కిస్తోన్నారు. తెలుగులో పూర్తి స్థాయి ఏఐ టెక్నాల‌జీతో రూపొందిన ఓ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. “అంబ’s రివేంజ్‌” పేరుతో రూపొందిన ఈ మూవీకి జ‌య‌వ‌ర్ధ‌న్ మాడి క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి కుందూరు ఈ సినిమాను నిర్మించారు.

మ‌హాభార‌తం ఆధారంగా...

మహాభారతంలోని పాత్ర అంబ కథను ఆధారంగా మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రూపొందించారు. హ‌నుమాజ్ జ‌యంతి సందర్భంగా “అంబ’s రివేంజ్‌” టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసింది.

భీష్ముడిపై రివేంజ్‌...

భీష్ముడిపై అంబ ప్ర‌తీకారంతో ర‌గిలిపోవ‌డానికి కార‌ణం ఏమిటి? సాల్వ మ‌హారాజుతో అంబ‌కు జ‌ర‌గాల్సిన పెళ్లిని భీష్యుడు ఎలా అడ్డుకున్నాడు? శివుడి అనుగ్ర‌హంతో శిఖండిగా మారి భీష్యుడిపై అంబ ఏ విధంగా రివేంజ్ తీర్చుకుంద‌నే అంశాల‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నామ‌ని ద‌ర్శ‌కుడు అన్నారు.

కొత్త ప్ర‌యోగం...

ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి నాందిగా నిలుస్తుంది. “అంబ’s రివేంజ్‌” మూవీ కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను ఉప‌యోగించాం. విజువల్స్‌, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం కొత్త‌గా ఉంటాయి. పౌరాణిక కథను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తున్న రూపొందించిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌కు స‌రికొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందిస్తుంది అని మేక‌ర్స్ పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement