త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Disha Patani | విమ‌ర్శ‌ల‌కు బ‌దులిచ్చే రోజు వ‌స్తుంది – ప్ర‌భాస్ మూవీపై దిశా ప‌టానీ కామెంట్స్

ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ మూవీలో దిశా ప‌టానీ రోల్‌పై చాలా ట్రోల్స్ వ‌చ్చాయి. ఓ పాట‌తో పాటు కొన్ని సీన్ల‌లోనే ఆమె క‌నిపించ‌డంపై అభిమానులు విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌ల్కి సీక్వెల్‌లో ఆమె క్యారెక్ట‌ర్ లెంగ్త్ ఎక్కువ‌గానే ఉంటుంద‌ట‌.

N

Entertainment | Published On Mar 5, 2026, 6.01 pm IST

Disha Patani | విమ‌ర్శ‌ల‌కు బ‌దులిచ్చే రోజు వ‌స్తుంది – ప్ర‌భాస్ మూవీపై దిశా ప‌టానీ కామెంట్స్
Advertisement

Disha Patani |  ప్ర‌భాస్ క‌ల్కి 2 మూవీపై బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క‌ల్కి 2898 ఏడీ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 1100 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో ప్ర‌భాస్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. క‌ల్కి మూవీకి సీక్వెల్‌ను కూడా రాబోతుంది. ఇటీవ‌లే సెకండ్ పార్ట్ సెట్స్‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం బిగ్‌బీ అమితాబ్‌బ‌చ్చ‌న్‌, లెజెండ‌రీ యాక్ట‌ర్ క‌మ‌ల్‌హాస‌న్‌ల‌పై డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ ఈ మూవీ షూటింగ్‌లో అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌భాస్‌కు జోడీగా...

క‌ల్కి మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా దిశా ప‌టానీ క‌నిపించింది. రెబెల్ స్టార్ ల‌వ‌ర్‌గా న‌టించింది. అయితే పార్ట్ వ‌న్‌లో దిశా ప‌టానీ స్క్రీన్ టైమ్‌పై అప్ప‌ట్లో చాలానే ట్రోల్స్ వ‌చ్చాయి. మూడు గంట‌ల ర‌న్‌టైమ్‌తో కూడిన ఈ సినిమాలో ఇర‌వై నిమిషాల్లోనే దిశా ప‌టానీ క్యారెక్ట‌ర్ క‌నిపించింది. ఓ పాట‌తో పాటు రెండు, మూడు సీన్ల‌లోనే ఆమెను డైరెక్ట‌ర్ చూపించారు. కేవ‌లం ఒక్క పాట కోస‌మే దిశాను తీసుకున్నార‌ని, సినిమా లెంగ్త్ పెర‌గ‌డానికి త‌ప్పితే ఈ బాలీవుడ్ హీరోయిన్‌ క్యారెక్ట‌ర్ వ‌ల్ల సినిమాకు ఎలాంటి ఉప‌యోగం లేదంటూ ఆమెపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ ట్రోల్స్ నేప‌థ్యంలో సీక్వెల్ నుంచి దిశా క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌పై దిశా ప‌టానీ క్లారిటీ ఇచ్చింది.

డైలాగ్స్‌ ఎక్కువే....

క‌ల్కి సీక్వెల్‌లో తాను న‌టిస్తున్నాన‌ని దిశా ప‌టానీ అన్న‌ది. త‌న‌ను తొల‌గించిన‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని చెప్పింది. పార్ట్ వ‌న్‌తో పోలిస్తే సీక్వెల్‌తో త‌న క్యారెక్ట‌ర్‌కు ఇంపార్టెన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని దిశా ప‌టానీ తెలిపింది. "క‌ల్కి 2లో నా క్యారెక్ట‌ర్ స్క్రీన్ టైమ్, డైలాగ్స్‌ ఎక్కువే. ప్ర‌భాస్‌తో పాటు క‌మ‌ల్‌హాస‌న్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్ వంటి న‌టుల‌తో నా కాంబినేష‌న్లు సీన్లు ఉంటాయి. క‌ల్కి మొద‌టి భాగం రిలీజైన టైమ్‌లో నా పాత్రపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌న్నింటికి ఈ సీక్వెల్‌తో త‌ప్ప‌కుండా బ‌దులిస్తా. ఆ రోజు కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా" అని చెప్పింది.

దీపికా స్థానంలో సాయిప‌ల్ల‌వి...

కాగా క‌ల్కి 2898 ఏడీలో దీపికా ప‌దుకొనే మెయిన్ హీరోయిన్‌గా క‌నిపించింది. రెమ్యూన‌రేష‌న్ ఎక్కువ డిమాండ్ చేయ‌డంతో పాటు వ‌ర్కింగ్ అవ‌ర్స్ కండీష‌న్ కార‌ణంగా నిర్మాత‌లు ఆమెను సినిమా నుంచి త‌ప్పించారు. దీపికా ప్లేస్‌లో సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఎంచుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.క‌ల్కి 2 మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement