Yellamma Movie | ఎల్లమ్మ కోసం దేవిశ్రీకి దిల్‌రాజు ఆఫర్ – నెలలో పది రోజులే షూటింగ్
ఎల్లమ్మ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దేవిశ్రీకి దిల్‌రాజు ఓ మంచి ఆఫర్ ఇచ్చాడట. ఆ ఆఫర్ ఏంటంటే?
Entertainment | Published On Feb 21, 2026, 5.12 pm IST
Yellamma Movie | ఎల్లమ్మ మూవీతో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల దేవిశ్రీప్రసాద్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఓ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో దేవిశ్రీప్రసాద్ లుక్, హీరో పాత్ర కోసం ఆయన మేకోవర్ అయిన తీరు అభిమానులను ఆకట్టుకున్నాయి. వెనుకబడిన కులానికి చెందిన డప్పు వాయిద్య కళాకారుడి జీవితం నేపథ్యంలో మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో ఎల్లమ్మ మూవీ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సుకుమార్ డైరెక్షన్‌లో...
ఎల్లమ్మ కంటే ముందే హీరోగా దేవిశ్రీప్రసాద్‌కు చాలానే అవకాశాలు వచ్చాయట. సుకుమార్ డైరెక్షన్‌లో తాను హీరోగా ఓ సినిమా చేయాల్సిందని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఎల్లమ్మ ఆఫర్ తనకు రావడంపై దేవిశ్రీప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సుకుమార్ డైరెక్షన్‌లోనే హీరోగా నా డెబ్యూ మూవీ రావాల్సింది. అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. అదే టైమ్‌లో మా నాన్న చనిపోవడంతో ఆ బాధలో యాక్టింగ్‌ఫై అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. దాంతో ఆ సినిమా ఆగిపోయింది. డైరెక్టర్లు త్రివిక్రమ్, హరీష్ శంకర్ కూడా నాతో సినిమాలు చేస్తానని అన్నారు. దిల్‌రాజు కూడా యాక్టింగ్ విషయంలో చాలా రోజులుగా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. యాక్టింగ్ డెబ్యూ కోసం ఎల్లమ్మ కంటే ముందు చాలా కథలు విన్నా. కానీ అవేవి అంతగా నచ్చలేదు. ఎల్లమ్మ కథ మాత్రం వినగానే చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పానని దేవిశ్రీప్రసాద్ చెప్పారు.
తొలి సినిమా...
హీరోగా మారినా మ్యూజిక్‌కు మాత్రం దూరం కానని దేవిశ్రీప్రసాద్ చెప్పారు. సంగీతానికే తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు. ఎల్లమ్మ మూవీకి నేనే సంగీతం అందిస్తున్నా. మ్యూజిక్ డైరెక్టర్‌గా నా డెబ్యూ మూవీ మైథలాజికల్ కథతోనే రూపొందింది. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ కూడా భక్తితో ముడిపడిన కథే కావడం ఆనందంగా ఉంది.
నెలలో పది రోజులే...
ఎల్లమ్మ మూవీ కోసం దిల్‌రాజు నన్ను అప్రోచ్ అయినప్పుడు నెలలో పది రోజులు డేట్స్ కేటాయిస్తే చాలు...దాని ప్రకారం మేం షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటాం. మిగిలిన టైమ్‌లో నువ్వు మ్యూజిక్ కేటాయించుకోవచ్చునని అన్నారు. ఆయన ఇచ్చిన ఆఫర్ కూడా తనకు బాగా నచ్చిందని దేవిశ్రీప్రసాద్ చెప్పారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



