త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shrasti Verma | న్యాయం చేయ‌రా దేవుడా అంటున్న శ్ర‌ష్టి వ‌ర్మ – ఐటెంగ‌ర్ల్‌గా మారిన బిగ్‌బాస్ బ్యూటీ

బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్, కొరియోగ్రాఫ‌ర్ శ్ర‌ష్టి వ‌ర్మ ఐటెంసాంగ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ధ‌ర్మ‌స్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం మూవీలో స్పెష‌ల్ సాంగ్ చేసింది. శ్ర‌ష్టివ‌ర్మ ఐటెంసాంగ్‌ను ఈ వారంలోనే రిలీజ్ చేయ‌బోతున్నారు.

a

Entertainment | Published On Feb 16, 2026, 6.49 pm IST

Shrasti Verma | న్యాయం చేయ‌రా దేవుడా అంటున్న శ్ర‌ష్టి వ‌ర్మ –  ఐటెంగ‌ర్ల్‌గా మారిన బిగ్‌బాస్ బ్యూటీ
Advertisement

Shrasti Verma | బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్‌, కొరియోగ్రాఫ‌ర్ శ్ర‌ష్టి వ‌ర్మ యాక్ట‌ర్‌గా మారింది. ఐటెంసాంగ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. జానీ మాస్ట‌ర్‌ వివాదం కార‌ణంగా శ్ర‌ష్టి వ‌ర్మ పేరు అప్ప‌ట్లో టాలీవుడ్‌లో బాగా వినిపించింది. జానీ మాస్ట‌ర్ త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడంటూ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చింది శ్ర‌ష్టి వ‌ర్మ‌. ఆమె ఆరోప‌ణ‌ల కార‌ణంగా జానీ మాస్ట‌ర్‌కు రావాల్సిన నేష‌న‌ల్ అవార్డు కూడా ర‌ద్దు అయ్యింది. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లో ఉంది. జానీ మాస్ట‌ర్ వివాదం త‌ర్వాత ఎక్క‌డ క‌నిపించ‌ని శ్ర‌ష్టి వ‌ర్మ ఇటీవ‌ల ముగిసిన‌ బిగ్‌బాస్ సీజ‌న్ 9లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి స‌ర్‌ప్రైజ్ చేసింది. కానీ శ్ర‌ష్టి వ‌ర్మ ఫ‌స్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయ్యింది.

న్యాయం చేయ‌రా దేవుడా...

తాజాగా శ్ర‌ష్టి వ‌ర్మ యాక్ట‌ర్‌గా మారింది. ధ‌ర్మ‌స్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలో ఐటెంసాంగ్‌లో నిలిచింది. న్యాయం చేయ‌రా దేవుడా ...అంటూ సాగే ఈ పాట‌ను ఈ వారంలోనే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ పాట‌కు శ్ర‌ష్టి వ‌ర్మ స్టెప్పులు, గ్లామ‌ర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

వ‌రుణ్ సందేశ్‌, వితికా శేరు...

ధ‌ర్మ‌స్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాలో సుమన్, సాయికుమార్ తో పాటు రియ‌ల్‌లైఫ్ టాలీవుడ్ క‌పుల్‌ వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. . జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు జ‌రుగుతోన్నాయి.

ప్ర‌మోష‌న్స్ మొద‌లు...

డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ధర్మస్థల నియోజకవర్గం ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అన్నారు." శ్ర‌ష్టి వ‌ర్మ న‌టించిన ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ సాంగ్‌‌తో ఈ సినిమా ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతున్నాం. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఆక‌ట్టుకుంటాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం" అని డైరెక్ట‌ర్ తెలిపారు.

 

Advertisement
Advertisement